పవన్ పెళ్ళిళ్ళపై జగన్ కామెంట్లు.. జనసేన దిమ్మతిరిగే కౌంటర్
11-11-201911-11-2019 15:17:36 IST
Updated On 11-11-2019 15:17:24 ISTUpdated On 11-11-20192019-11-11T09:47:36.137Z11-11-2019 2019-11-11T09:46:30.472Z - 2019-11-11T09:47:24.760Z - 11-11-2019

ఏపీలో పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుల మీద. విపక్షాల విమర్శల మీద జగన్ చేసిన కామెంట్లు ఒకవైపు వైరల్ అవుతుంటే.. జనసేన దీనిపై ఘాటుగా స్పందించింది. సినీనటుడు పవన్ కళ్యాణ్ కి ముగ్గురు భార్యలని, నలుగురో ఐదుగురో పిల్లలని పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. ఏపీలో తెలుగు భాషను మృతభాషగా చేయాలని తెగ ఆరాటపడుతున్నారని విపక్ష నేతలు జగన్ మీద మండిపడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఏపీ సీఎం జగన్ ఆంగ్లభాష ఆవశ్యకతను వివరించారు. ఇంగ్లీషు మీడియం చదవకపోతే పిల్లలు నష్టపోతారన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనన్నారు జగన్. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ దశలవారీగా ఇంగ్లీషు మీడియం చదువులు చెబుతామన్నారు. దీనిపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్, వెంకయ్యలపై కౌంటర్లేశారు జగన్. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగానే సమాధానం ఇచ్చిందని చెప్పాలి.
‘పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, జగన్ వ్యాఖ్యలకు జనసేన సోషల్ మీడియా టీం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘
మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్ ?’ అని జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని జనసేన అధికారిక ఖాతాలో రీ ట్వీట్ చేశారు. ఈ కౌంటర్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.


కాంగ్రెస్‌లో ఆ నలుగురూ ఒక్కటవుతున్నారట..!
2 hours ago

జగన్ ఎఫెక్ట్.. ఫుల్ బిజీగా ప్రశాంత్ కిషోర్..!
2 hours ago

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
3 hours ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019
ఇంకా