newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

పవన్‌వి ఏకపక్ష నిర్ణయాలు?! పార్టీని వీడుతున్న కీలక నేతలు!

18-12-201918-12-2019 11:59:57 IST
2019-12-18T06:29:57.085Z18-12-2019 2019-12-18T06:29:51.222Z - - 11-08-2020

పవన్‌వి ఏకపక్ష నిర్ణయాలు?! పార్టీని వీడుతున్న కీలక నేతలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేనలో కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆపార్టీ ఎటువైపు వెళ్తుంతో అర్థకాని పరిస్థితి. పవన్‌ తీసుకుంటున్న నిర్ణయాలుసైతం జనసైనికులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత పవన్‌ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో ఆయన నిర్ణయాలను విబేధిస్తూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు జనసేనను వీడగా.. తాజాగా పార్టీ సిద్దాంతకర్త, వ్యూహకర్త, పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ జనసేనను వీడటం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడా నిరాశ చెందకుండా మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీలో ఓటమి తరువాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా ఏమాత్రం నిరాశకు లోనుకాకుండా తన పర్యటనలు, ప్రసంగాలతో పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు ఉత్తేపరుస్తూ వస్తున్నారు. కానీ ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డికి నిర్ణయాలకు మద్దతు తెలుపుతుండటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికితోడు తాజాగా రాజు రవితేజ పార్టీని వీడటం అసలు జనసేనలో ఏం జరుగుతుందో అర్థంకాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఇతర పార్టీల్లోని నేతలుసైతం జనసేనలో చేరారు. కానీ ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్నే జనసేన గెలుచుకోగలిగింది. పవన్‌ పోటీచేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. తరువాత జరిగిన పరిణామాలతో రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అద్దేపల్లి శ్రీధర్‌, పార్టీ కోశాధికారి, మెగా ఫ్యామిలీకి బంధువు రాఘవయ్య, శివశంకర్‌లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరోవైపు పార్టీలో కీలకవ్యక్తిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణసైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజు రవితేజ జనసేనకు రాజీనామా సమర్పించి, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది.

జనసేన స్థాపన టైంలో కులాలను ఏకం చేద్దాం, మతాలకు అతీతంగా నడుద్దామంటూ ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, ఇప్పుడు దానికి విరుద్దంగా వెళుతోందని రవితేజ ఆరోపించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు, విద్వేష ప్రసంగాలు చేసిన పవన్‌, నెలన్నర, రెండు నెలల నుంచి పూర్తిగా మారిపోయారని, పార్టీ మూల సిద్దాంతాలకు విరుద్దంగా, కులమతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని రవితేజ చెప్పుకోచ్చారు.

మరోవైపు రవితేజతో పాటు గతంలో కొందరు జనసేనను వీడటానికి నాదెండ్ల మనోహర్‌ కూడా కారణమనే చర్చసాగుతుంది. పవన్‌ కళ్యాణ్‌ కేవలం నాదెండ్ల మనోహర్‌కే ప్రాధాన్యతనిస్తున్నాడని, పార్టీలో మేదావులున్నా పట్టించుకోవటం లేదని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేర్కొనడం కొసమెరుపు. పార్టీకి సంబంధించి ఏమైనా నిర్ణయాలు ఉంటే పవన్‌, నాదెండ్ల మనోహర్‌ మాత్రమేచర్చించుకుంటారని అనడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పవన్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత మరింత మార్పు వచ్చిందని, బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నట్లు కనిపిస్తుందనే చర్చ ఏపీలో సాగుతుంది.

జనసేన పార్టీ రాబోయే కాలంలో బలోపేతం కావాలంటే కేంద్రం సపోర్టు కావాలని పవన్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్‌రెడ్డి అంటే పవన్‌ ఒంటికాలుపే లేస్తున్నాడు.. జగన్‌సైతం పవన్‌ టాపిక్‌ వచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో పార్టీని బలోపేతం చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును లాక్కోవాలని, మరోవైపు హిందుత్వ ఓటును తమవైపుకు తిప్పుకోవాలంటే వైకాపాపై ఎదురుదాడే ఏకైక మార్గమని పవన్‌ భావిస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. దీంతో బీజేపీ సపోర్టుతో వైకాపాపై పవన్‌ ఎదురుదాడి దిగుతున్నారని ప్రచారం సాగుతుంది. మరి రాబోయే కాలంలో జనసేన బలోపేతానికి పవన్‌ నిర్ణయాలు ఏమేరకు ఉపయోగపడతాయి.. పార్టీని వీడుతున్న వారిని ఎలా కట్టడి చేయగలుగుతారో వేచి చూడాల్సిందే.

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle