పవన్‌పై వైసీపీ తీవ్ర విమర్శలు..విజయ సాయి వ్యంగ్యాస్త్రాలు
04-12-201904-12-2019 13:00:43 IST
2019-12-04T07:30:43.637Z04-12-2019 2019-12-04T07:30:41.772Z - - 09-12-2019

పవన్ కళ్యాణ్ పైన, ఆయన పార్టీపైన వైసీపీ నేతలు విరుచుకుపడుతూనే వున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పవన్ చేసిన కామెంట్లను టార్గెట్ చేసుకుని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని విమర్శలు చేస్తున్నారు. తిరుపతి పర్యటనలో దేశ రాజకీయాలకు మోడీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే ఉక్కుపాదంతో అణిచివేస్తారని కామెంట్ చేశారు. ఆ భయం వైసీపీకి ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో జనసేన విలీనం చేయడానికి సిద్ధమవుతున్నారని కొడాలి నాని అన్నారు. రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని, మెత్తగా మాట్లాడితే మనుషులు వినరని, ఉక్కుపాదంతో అణచివేస్తారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఈవిధంగా స్పందించారు. గతంలో అమిత్ షా జనసేనను విలీనం చేయాలని అడిగారని పవన్ అన్న మాటల్ని మళ్ళీ రిపీట్ చేశారు కొడాలి నాని. తాజా కామెంట్లను బట్టి త్వరలో విలీనం చేస్తారేమో అని కామెంట్ చేశారు నాని. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారని ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని నాని చురకలంటించారు. వీరికి తోడు ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ అంటేనే అంతెత్తున ఎగిరిపడతారు. అలాంటిది ఆయనకు మంచి అస్త్రాలు దొరికినట్టున్నాయి. ట్వీట్ల మీద ట్వీట్లతో రెచ్చిపోయారు. ‘‘నీ ప్యాకేజీ పార్టీని ప్రజలు గుర్తించకనే డిపాజిట్లు కూడా దక్కనంతగా ఛీ కొట్టారు. దత్తపుత్రుడివని తెలిసే భీమవరం, గాజువాక ఓటర్లు స్థానిక నాయకులను అక్కున చేర్చుకున్నారు. నువ్వే పెద్ద తిరస్కృతుడివి. ఇంకొకరిని గుర్తించాలా, విస్మరించాలా అనే స్థాయి నీకెక్కడిది పవన్ నాయడు?’’ అన్నారు విజయ సాయిరెడ్డి. అంతేకాదు, వానపడుతుంటే, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని బయటకు వెళ్తారు ఎవరైనా. దత్త పుత్రుడు ఈ రెండిటికీ భిన్నం. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతాడు. గంట గంటకూ చిత్త భ్రమలకు లోనవుతుంటాడు. ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో అంతుబట్టదు. బిజేపీలో విలీనానికి గ్రౌండ్ ప్రిపేరు చేసుకుంటున్నాడు. ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్రశ్నించారు వైసీపీ ఎంపీ. విజయసాయిరెడ్డి తాజా ట్వీట్లతో రాజకీయం చలికాలంలో ఏపీలో వేడెక్కింది. దీనిపై పవన్ ఏమంటారో చూడాలి.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
11 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్‌పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్‌లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా