newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

పవన్‌ది ప్యాకేజీ ట్రెండా? వైసీపీ మాటల యుద్ధం

25-03-201925-03-2019 13:23:03 IST
Updated On 26-03-2019 18:05:24 ISTUpdated On 26-03-20192019-03-25T07:53:03.889Z25-03-2019 2019-03-25T07:52:49.634Z - 2019-03-26T12:35:24.539Z - 26-03-2019

పవన్‌ది ప్యాకేజీ ట్రెండా? వైసీపీ మాటల యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మాటల యుద్ధం కూడా శృతిమించుతోంది. వైసీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శలు పడుతున్నాయి. పవన్ టార్గెట్‌గా జగన్ వర్గం భారీ విమర్శలు చేస్తోంది. 

 ‘‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తాను’’ అన్నది ఒక సినిమాలో పవన్‌ కల్యాణ్‌ డైలాగ్‌. ఆ డైలాగ్ లక్ష్యంగా వైసీపీ పవన్‌పై ఆరోపణలు చేస్తోంది. ప్యాకేజీల పవన్‌గా సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న జనసేన అధినేత తాజాగా ఎన్నికల పొత్తుల్లో ఇంతకుముందెన్నడూ లేని కొత్త ప్యాకేజీ ట్రెండ్‌ను క్రియేట్‌ చేశారని వైసీపీ అంటోంది. 

చంద్రబాబును కాకుండా ప్రతిపక్షమే లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం.. బాబు, పవన్‌ల కుమ్మక్కు కుట్రను సుస్పష్టం చేస్తుండగా.. అందుకు తగ్గట్లుగానే జనసేన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిటారుగా నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగిపోయారంటూ పవన్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు అని ఆరోపించారు. 

పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసిపోయాడన్నారు. దోపిడి సొమ్ముకు కాపలా కుక్కలా మారిపోయారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇలాంటి వారిని దుడ్డుకర్రలతో వెంటపడి తరిమేస్తారన్నారు. కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ జగన్‌పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే.  జగన్ రాయలసీమను రక్తసీమగా మార్చారని.. తాము అధికారంలోకి వస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. 

పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే కుదరదని జగన్‌ను హెచ్చరించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డికి కూడా ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. తాట తీస్తానని హెచ్చరించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇవాళ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇటు పవన్ విమర్శలు-వైసీపీ నేతల ట్వీట్లతో తెలుగునేలపై ఎన్నికల వేడి మరింత పెరిగింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle