newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

పవన్‌కు వాస్తవం బోధపడిందా?

24-04-201924-04-2019 12:19:47 IST
Updated On 04-07-2019 16:33:58 ISTUpdated On 04-07-20192019-04-24T06:49:47.003Z24-04-2019 2019-04-24T06:49:45.068Z - 2019-07-04T11:03:58.364Z - 04-07-2019

పవన్‌కు వాస్తవం బోధపడిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు నుంచీ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఓటరు నాడిని అంచనా వేసే పనిలో ఉన్నాయి. అనేక సర్వేలు, క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకొని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అంతిమంగా తామే అధికారంలోకి వస్తాయని రెండు పార్టీలూ ధీమాగా చెబుతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసినా.. తెలియకపోయినా పార్టీలు మాత్రం క్యాడర్‌లో నమ్మకం కలిగించేందుకు చివరి వరకు ఈ మాటలే చెప్పడం సహజం. ఇప్పుడు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ కూడా అదే చేస్తున్నారు.

అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి మాత్రం వీరికి విరుద్ధంగా ఉంది. కొంత ఆలస్యంగా సమీక్షలు ప్రారంభించిన ఆయన నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిని, ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులను అభ్యర్థులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తాము తెలుగుదేశం, వైసీపీ పార్టీల్లా ఎన్ని సీట్లు వస్తాయో లెక్కపెట్టుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ప్రజల్లో మార్పు మొదలైందని పవన్ పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వస్తున్నట్లు మాత్రం పవన్ ధీమాగా చెప్పడం లేదు. ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో తమ పాత్ర నామమాత్రమే అనేది తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, పవన్ ముందునుంచీ తాను 25 ఏళ్లు ప్రజాజీవితంలో ఉండేందుకు వచ్చానని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదన్నారు. మళ్లీ ఆయన క్యాడర్‌లో జోష్ నింపేందుకు తాను ముఖ్యమంత్రిని అవుతానని, ఈ ఎన్నికల్లోనే సీఎం అవుతానని చెప్పారు.  ఆ పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ సహా పలువురు జనసేన నేతలు తాము అధికారంలోకి రాబోతున్నామని ఎన్నికల తర్వాత కూడా పలుమార్లు ప్రకటించారు. 

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం లేదని క్యాడర్‌ను మానసికంగా సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. దీంతో పాటు పవన్ తన పార్టీ అభ్యర్థులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉండాలని, ప్రజలను మళ్లీ కలిసి ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. ఇది రాజకీయంగా మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. 

ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ - వైసీపీ మధ్య జరగడం, జనసేన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల పవన్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడలేదు. పైగా గత ఎన్నికల తర్వాత ఆయన చాలా కాలం ప్రజలకు దూరంగా ఉండి ఈ ఎన్నికల ముందే మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. పవన్ చెప్పినట్లుగా గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటే మాత్రం రానున్న రోజుల్లో రాష్ట్రంలో జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ పెద్దగా ఆశలు అయితే పెట్టుకున్నట్లు కనిపించడం లేదు.  


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle