newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

పవన్‌కు వాళ్లనుంచే అసలైన సన్ స్ట్రోక్

08-04-201908-04-2019 11:55:45 IST
2019-04-08T06:25:45.497Z08-04-2019 2019-04-08T06:25:43.363Z - - 19-02-2020

పవన్‌కు వాళ్లనుంచే అసలైన సన్ స్ట్రోక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన వేసుకున్న లెక్కల్లో సీటు పక్కా అనే స్థానం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ యూత్ ఓటర్లు, విద్యావంతుల ఓట్లు జనసేనకు కలిసొస్తే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీలో ఉండటం అదనంగా పార్టీకి ఓట్లను తెచ్చిపెట్టే అంశం. అందుకే మిగతా పార్టీలు కూడా పెద్దగా విశాఖ సీటుమీద ఆశ పెట్టుకున్నట్టు లేవు. కానీ.. పోలింగ్‌తేదీ సమీపిస్తోంటే విశాఖలో జనసేనకు భారీ షాక్‌ తగిలింది. ఇలాంటి కీలక సమయంలో జనసేన అవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన సీనియర్‌ నాయకురాలు గుంటూరు భారతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఆమె నేరుగా వెళ్లి వైఎస్సార్‌సీపీలో చేరారు. భారతి వైఎస్సార్‌సీపీలో చేరడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న గంటా వర్గం కూడా డీలా పడినట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి భారతి ద్వారా ఓట్లు ఆశించిన టీడీపీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ నేత పైలా రమేశ్‌, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నేత అనిశెట్టి సుబ్బారావు, వైఎస్సార్‌కడప జిల్లా నాయకుడు మాలే శివ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యర్రా నవీన్‌లు కూడా జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. 

టీడీపీతో లోపాయకారి ఒప్పందం ఉందన్న ఆరోపణలు.. క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహకరించుకోవడం లాంటి అంశాలు జనసేన కింది స్థాయి నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదని ఈ మార్పులను బట్టి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీలో చేరుతున్న వారి వల్ల ఆమేరకు జనసేన ఓట్లపై ప్రభావం పడే అవకాశం కచ్చితంగా ఉండొచ్చన్న భయం పవన్‌లోనూ మొదలైంది. మొన్ననే వడదెబ్బకు గురైన పవన్‌కు పార్టీ నేతలు కూడా స్ట్రోక్ ఇవ్వడంతో ఇబ్బందిపడుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle