పవన్‌కు కాంగ్రెస్, కామ్రేడ్స్ షాక్.. లాంగ్ మార్చ్‌కు దూరం
02-11-201902-11-2019 18:44:29 IST
2019-11-02T13:14:29.605Z02-11-2019 2019-11-02T13:14:22.851Z - - 15-12-2019

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకిచ్చింది ఏపీ కాంగ్రెస్. ఆదివారం విశాఖలో ఇసుక పై పవన్ నిర్వహించనున్న లాంగ్ మార్చ్ కు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి.
రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక సమస్య పై లాంగ్ మార్చ్‌లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మనోహర్ తనకు ఫోన్ చేశారని తులసిరెడ్డి చెప్పారు.
పార్టీ నేతలతో చర్చించిన అనంతరం పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనకూడదని నిర్ణయించామని ఆయన వివరించారు. గతంలో మా ఆందోళనలో పవన్ పాల్గొనలేదు కాబట్టి ప్రస్తుతం పవన్ చేస్తున్న ఇసుక లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదనేది అవాస్తవం అన్నారు. అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో భాగంగానే మాత్రమే పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. వామపక్షాలు సైతం కాంగ్రెస్ బాటలోనే నడిచాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు రామకృష్ణ, మధు లేఖ రాశారు. విశాఖలో జరిగే లాంగ్ మార్చ్‌కు తమ సంఘీభావం తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ సహకారం తీసుకోవాలనుకోవడంపై అభ్యంతరం తెలిపారు. పవన్ చేపట్టే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.
మరోవైపు లాంగ్ మార్చ్ అనుమతుల విషయంలో తప్పుడు ప్రచారం సాగుతోందని జనసైనికులు నమ్మవద్దని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. విశాఖపట్నంలో జరిగే లాంగ్ మార్చ్‌కు పోలీసులు అనుమతులు ఇచ్చారన్నారు. అనుమతికి సంబంధించిన డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశారు.



రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా