ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

పవన్‌కి తలనొప్పిగా మారిన లోకల్ ఫీలింగ్

05-04-201905-04-2019 15:27:04 IST
2019-04-05T09:57:04.575Z05-04-2019 2019-04-05T09:57:02.916Z - - 19-05-2019

పవన్‌కి తలనొప్పిగా మారిన లోకల్ ఫీలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే రెండుచోట్ల గెలిచే అవకాశాలు ఎలా వున్నా.. పవన్ కనీసం ఒక చోట కూడా గెలుపు మాత్రం కష్టంగా వుందంటున్నారు. గాజువాకలో నాన్ లోకల్ ఫీలింగ్ బాగా పెరిగిపోయింది. పవన్ ఓటమికోసం స్కెచ్ వేసిన వైసీపీ, టీడీపీ నేతలు పవన్ అడ్రస్ గురించి అడుగుతున్నారు. చంటిగాడు లోకల్ అన్నట్టుగా, తాము లోకల్ అని, తమ ఇంటి అడ్రస్ మీకు తెలుసని.. మీకు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడో మీకు తెలుసా అని ప్రత్యర్థులు ప్రచారంలో హైలైట్ చేస్తున్నారు.

స్థానికులను ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని... అందుకే తమను ఎన్నుకోవాలని వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు లోకల్ సెంటిమెంట్ రాజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటారో మీకు తెలుసా, ఒక వేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మీ సమస్యలను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే ఎక్కడికెళతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. గాజువాకలో గెలుపు గ్యారంటీ అని భావిస్తున్న పవన్ కళ్యాణ్, ఇతర జనసేన నాయకులకు ఈ సెంటిమెంట్ తలనొప్పిని కలిగిస్తోంది. దీంతో గెలుపుపై ధీమాతో వున్న జనసైనికులు ఢీలా పడిపోతున్నారు. 

ఇటు పవన్ స్వంత జిల్లా భీమవరంలో అయితే అక్కడి ప్రత్యర్థి పార్టీలు మరో ప్రచారం తెరమీదకు తెచ్చాయి. పవన్ కళ్యాణ్ గెలిస్తే రాజీనామా చేస్తారని, భీమవరంలో మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందని, ఆ మాత్రం దానికి మీరు పవన్‌కి ఓటెయ్యడం ఎందుకు దండగ అంటున్నారు. ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ ఎన్నికల ముందు వచ్చి భీమవరం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు భీమవరం స్థానికులు. పవన్, నాగబాబు గెలుపుకోసం స్థానికతను తెరమీదకు తెస్తున్నారని, ఈ ప్రాంతానికి పవన్ వల్ల ఏం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. 

నిరంతరం అభివృద్ధిని కాంక్షించే టీడీపీకి ఓటు వేయాలని రామాంజనేయులు ప్రచారం చేస్తుంటే.. రెండుసార్లు తాను ఓటమి చవిచూశానని, ఈసారైనా తనకు అవకాశం ఇస్తే భీమవరంని స్మార్ట్ సిటీగా మారుస్తానని, జగన్ తో దెబ్బలాడి మరీ నిధులు తెస్తానని వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ హామీ ఇస్తున్నారు. అక్కడి స్థానికులు కూడా పవన్ పట్ల అంత సానుకూలంగా లేరని సమాచారం.

దీంతో భీమవరంలో జనసేనకు ఎదురుగాలి వీస్తోంది. పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్యే వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద భీమవరంలో పవన్ గెలుపుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జనసేన సైనికులు మాత్రం పవన్ గెలవడం ఖాయం అని ధీమాతో వున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle