ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

పవన్‌కి అలీ స్ట్రాంగ్ పంచ్

09-04-201909-04-2019 12:27:17 IST
2019-04-09T06:57:17.086Z09-04-2019 2019-04-09T06:57:15.338Z - - 19-05-2019

పవన్‌కి అలీ స్ట్రాంగ్ పంచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజమండ్రి సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత అలీ స్ట్రాంగ్ పంచ్ విసిరారు. తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌కల్యాణ్, లేదా ఆయన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. పవన్‌కల్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలో పైకి వచ్చారని, కానీ తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానన్నారు. తనకేదో ఆయన సాయపడినట్లుగా చెప్పుకున్నారని, అది వాస్తవం కాదన్నారు. అయితే తనకేం సాయం చేశారో చెప్పాలన్నారు. 

పవన్‌ సినిమాల్లోకి వచ్చేటప్పటికే తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశారు. ‘‘ఏ రకంగా పవన్‌ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే  ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? లేక ఇంకేమైనా సాయం చేశారా?’’ అని అలీ  ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్‌ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నారు.

‘‘నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరకూడదా? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?’’ అని అలీ పవన్‌ను ప్రశ్నించారు.  తన చుట్టం టికెట్‌ అడిగితే ఇచ్చానని, అలాంటిది అలీ అడిగితే ఇవ్వనా అని పవన్‌ వ్యాఖ్యలు చేశారని... తన ఫోన్‌ నంబర్‌ ఆయన వద్ద లేదా? అని అలీ ప్రశ్నించారు. అలీ, పవన్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ డిస్కషన్‌కి కారణం అవుతోంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle