newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

పవన్‌కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారు: కంచ ఐలయ్య

28-11-201928-11-2019 11:34:14 IST
2019-11-28T06:04:14.892Z28-11-2019 2019-11-28T06:04:10.992Z - - 09-12-2019

పవన్‌కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారు: కంచ ఐలయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్‌ మీడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియంను కార్పొరేట్‌ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటూ రాదని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య బుధవారం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ పేదకుటుంబాల పిల్లల తలరాతలు మార్చనున్న ఇంగ్లీష్ మాధ్యమంపై రాజకీయ నాయకులు ఎందుకింత వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.  ‘అన్ని పార్టీల నాయకులు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకుంటారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారు. మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా లేక పేదపిల్లలు పెద్దల పిల్లలకు పోటీగా వస్తారని భయపడుతున్నారా’ అంటూ ప్రశ్నించారు. 

ఇంగ్లీష్‌ వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, ఇప్పుడు మొత్తుకుంటున్న మేధావులు ప్రైవేట్‌ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టమని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్‌ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లల జీవితాలు బాగుపడడం చంద్రబాబు, పవన్‌లకు ఇష్టం లేదా అని సూటిగా ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలని ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని కుహనా మేధావులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా ఇంగ్లిషు మీడియం వద్దన్న వారంతా బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకులేనని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా లద్దిక మల్లేష్‌ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన భవిష్యత్తు అంతా సాంకేతిక కోర్సులు, రోబోటిక్స్‌తో నిండిపోనున్నాయి. వాటిలో జాబ్‌లు సంపాదించాలంటే తప్పకుండా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి అని తేల్చి చెప్పారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. మిగిలిన వారంతా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు. తెలుగును కాపాడేది ఈ బడుగు, బలహీన వర్గాల పిల్లలేనా? ప్రశ్నించే వారి పిల్లలకు తెలుగును కాపాడే అవసరం లేదా. జగన్‌ గారు ఇంగ్లిష్‌ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ ఎలా తప్పనిసరి చేశారో.. అదే విధంగా కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా తెలుగు సబ్జెక్ట్‌ తప్పని సరి చేయాలి. ఒక విషయం మాత్రం నిజం.. ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న వాళ్ళందరూ బడుగు, బలహీన వర్గాల వారికి వ్యతిరేకమే. ఈ సందర్భంగా వైఎస్  జగన్‌‌కి మరోసారి ధన్యవాధాలు అన్నారు ఆర్ నారాయణమూర్తి

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle