newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

పవన్­ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చూస్తాడా..?

30-03-201930-03-2019 13:46:20 IST
2019-03-30T08:16:20.190Z30-03-2019 2019-03-30T08:16:18.052Z - - 22-07-2019

పవన్­ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చూస్తాడా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా సంగతి ఎలా ఉన్నా అనేక సంచలనాలకు కారణమైంది వర్మ ఎన్టీఆర్ సినిమా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగం జరగుతున్న వేళ... ఆ సినిమాను ఎలాగైనా జనాలకు చేరకుండా ఓ వర్గం ప్రయత్నిస్తుంటే, జనాలకు చూపించడం ద్వారా ఓట్లు రాల్చుకునే ప్రయత్నం మరో వర్గం ప్రయత్నిస్తోంది. ఐతే సందట్లో సడేమియాలా ఈ సినిమాను ఎలాగైనా పవన్ కళ్యాణ్‌కి చూపించాలని జనసేనలోని ఒక వర్గం భావిస్తోందట. పవన్ కళ్యాణ్  చంద్రబాబుకు సహకరించడం ఇష్టంలేని జనసేనలోని కొందరు నేతలు తెలుగుదేశానికి లోపాయికారిగా సహకరించడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.

చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలి తప్ప చంద్రబాబుకు సహకరించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని మొదటి నుంచి వాదిస్తున్నారు. పైగా అవసరమున్నంత కాలం వాడుకుని తన వెంట ఉన్న వాళ్లను, నమ్ముకున్న వాళ్లను మోసం చేసే, వెన్నుపోటు పొడిచే తత్వం ఉన్న చంద్రబాబు గురించి పూర్తిగా తెలియడానికి వర్మ ఎన్టీఆర్ సినిమా చూపించాలని భావిస్తున్నారుట. 

ఆ సినిమా చూశాకైనా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు తీరు బోధపడి పునరాలోచన చేస్తారని వాళ్ల ఆశ. అందుకే ఎలాగైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూపించేందుకు సిద్ధమవుతున్నారట. ఎన్నికల హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా చూస్తారో లేదో మరి. అయితే.. ఏపీలో ఈ సినిమా రిలీజ్­పై స్టే ఉంది కాబట్టి వాట్సప్‌లో వైస్రాయి ఎపిసోడ్ సహా కీలక సన్నివేశాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా చూసేంత తీరిక పవన్‌కు లేకపోతే కనీసం ఈ సన్నివేశాలనైనా చూపించాలన్నది కొందరు జనసైనికుల ప్లాన్.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle