newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

పల్నాడు పోరాటంలో గెలుపెవరిది.? ఓటమి ఎవరికి..?

12-09-201912-09-2019 16:17:21 IST
2019-09-12T10:47:21.156Z12-09-2019 2019-09-12T09:47:32.836Z - - 27-02-2020

పల్నాడు పోరాటంలో గెలుపెవరిది.? ఓటమి ఎవరికి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఛలో ఆత్మకూరు అంటే అధికార, విపక్షాలు పోటాపోటీగా నిర్వహించిన కార్యక్రమంలో చివరికి ఎవరిది గెలుపు, ఎవరికి ఓటమి అన్నది వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య మరో వివాదంగా మారింది. పల్నాడు క్షేత్రంగా  అధికార, విపక్షాలు పరస్పరం ఢీకొన్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశం చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా వైకాపా అడుగులు వేసింది. చివరకు తెలుగుదేశం శ్రేణులను, నేతను ఎక్కడికక్కడ నిలువరించడం ద్వారా పంతం నెరవేర్చుకుంది.

సాక్షాత్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని గృహ నిర్బంధంలో పెట్టింది. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను అదుపులోనికి తీసుకుంది. ఏకంగా ఊళ్లకు ఊళ్లను నిర్బంధంలోనికి తీసుకున్నారా అన్నట్లుగా పోలీసుల  మోహరింపు జరిగింది. మొత్తానికి ఛలో ఆత్మకూరు కార్యక్రమం భగ్నమైంది. అయితే ఈ వ్యవహారంలో విజయం ఎవరిది. పరాజితులెవరు? అన్న ప్రశ్నకు మాత్రం ఏపార్టీ సమాధానం ఆ పార్టీకి ఉంది. ఇంతకీ ఎవరు గెలిచారు. ఆత్మకూరు వెళ్లలేకపోయిన తెలుగుదేశం పార్టీదా, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ద్వారా పల్నాడు మొత్తం ఖైదులో ఉందని పించేలా నిర్బంధాన్ని ప్రయోగించిన వైకాపాదా? అయితే రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన చంద్రబాబు రాజకీయంగా ఛలో ఆత్మకూరు పిలుపు ద్వారా వైకాపాపై పై చేయి సాధించారనే చెప్పాలి.

ప్రభుత్వం నిర్బంధ అస్త్రం ప్రయోగిస్తుందని తెలిసినా ఛలో ఆత్మకూరు పిలుపు ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏపీలో ప్రభుత్వ ప్రచారానికి తప్ప ఇంకే విషయానికీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని జాతీయ మీడియా సైతం ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి విస్తృత కవరేజ్ ఇచ్చింది. దీంతో ఏపీలో నిర్బంధం ఏ రేంజ్ లో ఉందో దేశం మొత్తానికీ తెలియజేయడంలో చంద్రబాబు సఫలమయ్యారు.

ఇప్పటికే వంద రోజుల పాలనలో జగన్ దూకుడు నిర్ణయాలు, వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం విపక్ష పార్టీ పట్ల కక్ష సాధింపు ధోరణిని అనుసరిస్తున్నదన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది. తాజాగా ఛలో ఆత్మకూరు భగ్నంతో అది బలపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

కరకట్ట మీద అక్రమ కట్టడాలంటూ ప్రజావేదిక కూల్చివేతతో ఆగిపోవడం, పోలవరం టెండర్ల రద్దు, అమరావతి విషయంలో అయోమయం సృష్టించే విధంగా మంత్రుల ప్రకటనలు ఇవన్నీ వైకాపా సర్కార్ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదొడటమే లక్ష్యంగా పని చేస్తున్నదన్న అనుమానాలు బలపడేందుకు దోహదపడ్డాయి. ఇక పీపీఏల రద్దు విషయంలో వైకాపా సర్కార్ దూకుడు, కోర్టులు సహా అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత రావడం వల్ల వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వైకాపా ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచేవిగా ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే తాజాగా చలో ఆత్మకూరు కార్యక్రమం భగ్నాన్ని తీసుకోవలసి ఉంటుంది.

Image result for palnadu ysrcp tdp war

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle