newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

పల్నాటి పులి డాక్టర్ కోడెల.. ఇక లేరు

16-09-201916-09-2019 13:25:32 IST
Updated On 16-09-2019 16:59:18 ISTUpdated On 16-09-20192019-09-16T07:55:32.285Z16-09-2019 2019-09-16T07:49:14.878Z - 2019-09-16T11:29:18.160Z - 16-09-2019

పల్నాటి పులి డాక్టర్ కోడెల.. ఇక లేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ డా.కోడెల శివప్రసాద్ రావు ఇక లేరు. ఆయన సోమవారం బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్ళు. ఆయనకు భార్య, ఒక కూతురు విజయలక్ష్మి, కొడుకులు శివరాం, సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతుంటే.. డాక్టర్లు మాత్రం ఆయన గుండెపోటుకి గురై మరణించారని చెబుతున్నారు. ఇటీవల ఆయనపై నమోదైన కేసుల కారణంగానే ఆయన తీవ్ర మానసిక వత్తిడికి గురై ఈచర్యకు పాల్పడ్డారని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక నేతగా ఎదిగారు. 

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. 

ఆర్ధిక స్థోమత అంతంతమాత్రమే అయినా, ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసంగా చెబుతున్నారు. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసారు కోడెల.  కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివారు.

పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. వైద్యవృత్తి తారాస్థాయిలో ఉన్నప్పటికీ అన్నగారి పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల.

2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయం పాలయ్యారు. 

ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించారు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ప్రారంభించారు.

స్వచ్చ ఆంధ్రప్రదేశ్లో భాగంగా డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు అతని నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.

ఇటీవల తూళ్లూరు పోలీసులు కోడెలపై అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోడెల కొడుకు శివరాం, కూతురుపై ట్యాక్స్ వేధింపుల కేసులుతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం.

కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కోడెలకు గుండెపోటు వచ్చిందని బసవతారకం ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుచరులు చెబుతున్నారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కోడెల శివప్రసాద్ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. కోడెల మరణవార్తను నమ్మలేకపోతున్నా. బలవన్మరణానికి పాల్పడతారని ఊహించలేదు. ఈ వార్త నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు సుజనా చౌదరి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle