newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

పలమనేరు పోరు రసవత్తరం

21-03-201921-03-2019 10:28:59 IST
Updated On 21-03-2019 12:00:56 ISTUpdated On 21-03-20192019-03-21T04:58:59.829Z21-03-2019 2019-03-21T04:58:52.804Z - 2019-03-21T06:30:56.194Z - 21-03-2019

పలమనేరు పోరు రసవత్తరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిత్తూరు జిల్లా పలమనేరులో పోటీ రసవత్తరంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి వెంకటయ్య గౌడ్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన అభ్యర్థి చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌ కూడా జనంలోకి దూసుకెళ్తున్నారు. పలమనేరు, పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో రెడ్డి, బలిజ, పల్లిరెడ్డి, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

మొదటి నుంచీ బలమైన రాజకీయ కుటుంబమైన అమర్ నాథ్ రెడ్డి, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇక రైతులు ఎదురు చూస్తున్న హంద్రీనీవా నీళ్లు ఇప్పటి దాకా అందలేదన్న ఆరోపణ నియోజకవర్గంలో బలంగా ఉంది. నాయకనేరి, గంకొండ, గుటక్ పల్లె చెక్ డ్యాంలు ఇంకా పూర్తి కాకపోవడం నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందిగా మారింది. చాలా కాలంగా ఈ పనులు పెండింగులో ఉన్నా, అమర్ నాథ్ రెడ్డి పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే కౌండిన్య రిజర్వాయర్ అందుబాటులో ఉన్నా కాల్వల సౌకర్యం పూర్తి కాకపోవడం రైతులకు శాపంగా మారిందట. ఎప్పటి నుంచో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెబుతున్న అమర్ నాథ్ రెడ్డి, ఇప్పటి దాకా ఆ పనులు మొదలు పెట్టలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారట అమర్ నాథ్ రెడ్డి. తనంటే గిట్టని వాళ్లే ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారట.

పార్టీ మారినా తాను చేసిన అభివృద్ధి పనులే, ఈ ఎన్నికల్లో కూడా విజయం అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారట అమర్ నాథ్ రెడ్డి. మరోవైపు చంద్రబాబు హయాంలో నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని చెబుతున్నారు వైసీపీ అభ్యర్థి వెంకటయ్య గౌడ్. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని చెబుతున్నారు. మొత్తానికి పలమనేరు పోరు అభ్యర్థుల ప్రచారంతో హాట్ హాట్ గా మారినట్లు తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle