newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పరవాడ గ్యాస్ లీకేజీపై సీఎం జగన్ ఆరా

30-06-202030-06-2020 09:18:54 IST
2020-06-30T03:48:54.966Z30-06-2020 2020-06-30T03:48:33.137Z - - 27-07-2021

పరవాడ గ్యాస్ లీకేజీపై సీఎం జగన్ ఆరా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నంలోని ఫార్మా పరిశ్రమల్లో తరచూ గ్యాస్ లీకేజీలు కావడంపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. పరవాడలో సాయినార్ ఫార్మాసిటీ కర్మాగారం నుంచి అర్థ రాత్రి బెంజిన్ వాయువు లీక్ కావడంతో ఇద్దరు షిఫ్ట్ ఇన్ చార్జ్ లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతులను  గుంటూరు జిల్లా కు చెందిన నరేంద్ర , విజయనగరం జిల్లాకు చెందిన గౌరిశంకర్ గా గుర్తింపు.  గ్యాస్ లీకేజీ కారణంగా సొమ్మసిల్లిన తోటి కార్మికులను గాజువాక ఆసుపత్రికి తరలించారు. 

సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మాలో గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ , పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనాల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ గ్యాస్ లీక్  జరగడంతో విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గ్యాస్ లీకేజీ ఆకంపెనీలోని ఓ విభాగానికి పరిమితమని తెలిపిన అధికారులు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎం జగన్ కి వివరణ ఇచ్చారు. 

సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీ అధికారుల ద్వారా  సీఎంఓ అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటననే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లాకలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు. 

ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్‌ వినయ్, , విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారని తెలిపారు. ఈఘటనపై విచారణ కూడాచేయిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

గ్యాస్ లీకేజీ ఘటనపై టీడీపీ దిగ్భ్రాంతి 

విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరం అన్నారు. ఇద్దరు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన లోకేష్.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఈఘటన పై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle