newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

పది రోజుల్లో 20 లక్షల సమాధాన పత్రాల స్కానింగ్. ఎలా సాధ్యం?

20-09-201920-09-2019 16:42:53 IST
2019-09-20T11:12:53.612Z20-09-2019 2019-09-20T09:56:58.904Z - - 24-02-2020

పది రోజుల్లో 20 లక్షల సమాధాన పత్రాల స్కానింగ్. ఎలా సాధ్యం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో కాస్తంత నిజాయితీతో, బాధ్యతతో పనిచేస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పడానికి సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉద్యోగాల కోసం కరువున పడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగార్థులకు కోటి ఆశలు రేపుతూ ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాను రికార్డు స్థాయిలో వెల్లడించడం అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. పరీక్షలంటేనే లీకులు, స్కాంలతో ప్రభుత్వాలు భీతిల్లుచున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో ప్రభుత్వోద్యోగాలను ప్రకటించడమే కాకుండా వాటి పరీక్షలను కూడా ఎంతో వేగంగా లోపరహితంగా నిర్వహించింది. కేవలం పదిరోజుల్లోపే దాదాపు 20 లక్షల మంది అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి, మార్కులను లెక్కించి గురువారం ఫలితాలను మెరుపు వేగంతో ప్రకటించింది. ఇటీవలి విద్యారంగ చరిత్రలో, ప్రభుత్వ పాలనా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది.  

గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఏపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌‌లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విజయవంతంగా విడుదల చేయడం గమనార్హం. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదిరోజుల్లో ఫలితాలు విడుదలయ్యేలా కృషి చేసిన అధికారులుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి కాగా రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశామనీ, పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాననీ వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఎంపికైన వారికి త్వరలోనే మంచి శిక్షణ ఇస్తామనీ, వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలనీ కోరారు.. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా అంకితభావంతో పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు.  అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయని చెప్పారు.

ఏ రకంగా చూసినా ఇది ప్రభుత్వ పరంగా జరిగిన మంచిపనితీరు. పాలకులూ, ఉద్యోగులూ ప్రజా సంక్షేమం పట్ల బాధ్యత గుర్తెరిగి మనసా వాచా పనిచస్తే, విధినిర్వహణలో ఎలాంటి లోపానికి గురికాకుండా బాధ్యతపడితే ఏం జరుగుతుందో చెప్పడానికి సచివాలయ పరీక్షలు పెద్ద ఉదాహరణ. 

పది రోజుల్లో 19.74 లక్షలమంది అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేయడం అసాధారణమైన విషయం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు విజయం పొందినట్లే. ఇదే స్ఫూర్తిని ఎంపికయ్యే కొత్త సచివాలయ ఉద్యోగుల్లో కూడా రగిలిస్తే సామాన్య ప్రజానీకం కనీవినీ ఎరుగని సేవలను అందుకునే రోజులు సమీపంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని ప్రభుత్వం కన్న కళలు నిజం కావాలని ఆశిద్దాం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle