newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

పడగెత్తిన ‘నాగ’బాబు... బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్

11-01-201911-01-2019 15:47:35 IST
2019-01-11T10:17:35.893Z11-01-2019 2019-01-11T10:17:27.048Z - - 17-07-2019

పడగెత్తిన ‘నాగ’బాబు... బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్నిరోజుల నుంచి బాలయ్యను టార్గెట్ చేస్తూ కౌంటర్స్ వేస్తున్న నాగబాబు... చివరికి ఓ వీడియోతో ఈ వివాదానికి ముగింపు పలికారు. అయితే... ఫైనల్ వీడియోలో మాత్రం నాగబాబు కాస్త ఘాటు పెంచారు. ఎప్పుడో జరిగినదానిపై ఇప్పుడు ఎందుకు స్పందించాల్సి వచ్చిందో స్పష్టత ఇస్తూ... బాలయ్యకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎపిసోడ్‌ని గుర్తు చేస్తూ... ఇకపై నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని హెచ్చరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘2012 జనవరిలో బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చిరంజీవి తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. అప్పుడు కోపం, బాధ ఒకేసారి తన్నుకువచ్చాయి. నేను వెంటనే స్పందించాలనుకున్నాను. కానీ... అన్నయ్య చిరంజీవి ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘బాలయ్య చిన్న పిల్లాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు’ అని వదిలేయడంతో మేమంతా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ప్రతి వ్యక్తికీ తన తండ్రి గొప్పవాడే కానీ... ఇతరుల్ని కించపరుస్తూ తండ్రిని కీర్తించడం ఏమాత్రం సంస్కారం కాదు.

అదే మాట మేము ‘చిరంజీవి కాలి గోటికి బాలకృష్ణ సరిపోడు’ అని అంటే మీకెలా ఉంటుంది? మీకు, మీ ఫ్యామిలీకి, మీ పార్టీ వర్గాలవారికి, ఫ్యాన్స్‌కి ఎలా ఉంటుంది? చిరంజీవి అంటే మీకంత లోకువ అయిపోయారా? మీకు ఎంత అహంకారం? అలా అనడం మాకు చేతకాదనుకుంటున్నారా? మాకు కోపాలు రావా? కానీ మాలో ఉన్న సంస్కారం కారణంగా మేమలా మాట్లాడటం లేదు. మర్యాదగా చెప్తున్నా... మాట్లాడే సమయంలో దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక్కడ ఎవరు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇకనుంచైనా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపేస్తారని కోరుకుంటున్నాను’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ అంటే మీకెంతో గౌరవమో... మా అన్నయ్య చిరంజీవి అంటే కూడా మాకెంతో గౌరవముందని నాగబాబు అన్నారు. ఆయన తమకు తండ్రితో సమానమని, అటువంటి వ్యక్తిపై మీరు నోరుజారినా మేమంతా ఊరికే ఉన్నామన్నారు. రాజకీయంగా అయితే పవన్‌కళ్యాణ్‌ని ఎదుర్కోండని, అతని పాలసీలపై ప్రశ్నించండని, అతను చేసే వ్యాఖ్యలపై విమర్శించండని నాగబాబు అన్నారు. రాజకీయ విమర్శలపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కానీ... తమ కుటుంబం గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం తాను మళ్ళీ ఎంటర్ అవ్వాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇన్నాళ్ళ తర్వాత బాలయ్య చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడం ఏంటని లేవనెత్తుతున్న ప్రశ్నలపై కూడా నాగబాబు జవాబిచ్చారు. తాను ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమాత్రం లేదని, ఇన్నాళ్ళూ భరించి భరించి చివరికి ఓపిక నశించి ఇప్పుడిలా స్పందించానన్నారు. ఇంట్లో దొంగతనం చేసిన దొంగ సంవత్సరం తర్వాత కనిపిస్తే... వదిలేయకుండా బడితపూజ చేస్తాం కదా! ఈ వ్యవహారం కూడా ఇంతేనని క్లారిటీ ఇచ్చారు. ఇంతటితో తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నానన్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle