newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

పంథా మారుస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

26-06-201926-06-2019 08:26:29 IST
Updated On 26-06-2019 16:59:16 ISTUpdated On 26-06-20192019-06-26T02:56:29.748Z26-06-2019 2019-06-26T02:56:23.053Z - 2019-06-26T11:29:16.176Z - 26-06-2019

పంథా మారుస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ స్థాపించి ఆరేళ్లు అవుతున్నా ఇంకా ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌హీనంగా ఉంది. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు బూత్ స్థాయి నుంచి బ‌ల‌మైన పునాదులు వేసుకొని ప‌టిష్ఠంగా ఉండ‌గా ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నుకుంటున్న జ‌న‌సేన పార్టీకి మాత్రం ఎక్క‌డా క్షేత్ర‌స్థాయిలో క‌మిటీలు ఏర్ప‌డ‌లేదు.

కేవ‌లం అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త ఇమేజ్‌, ఆయ‌న అభిమానులే పార్టీకి బ‌లంగా ఉంది. అయితే, అభిమానాన్ని, నాయ‌కుడి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను ఓట్లుగా మ‌ల్చుకోవ‌డంలో జ‌న‌సేన పార్టీ తీవ్రంగా విఫ‌ల‌మైంది.

పోటీ చేసిన మొద‌టి ఎన్నిక‌ల్లోనే ఘోర ఓట‌మిని చ‌విచూసిన ఆ పార్టీ ఇప్పుడు ఓట‌మికి కార‌ణాల‌ను విశ్లేషించుకునే ప‌నిలో ప‌డింది. సోమ‌వారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో పార్టీకి ఓట‌మిని నేత‌లు స‌మీక్షించారు. సంస్థాగ‌తంగా పార్టీ బ‌లంగా లేక‌పోవ‌డ‌మే దారుణ ఓట‌మికి ముఖ్య కార‌ణంగా గుర్తించి ఈ మేర‌కు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీకి పూర్తి స్థాయిలో క‌మిటీలు లేవు. దీంతో ముందు క‌మిటీ ఏర్పాటుపై ప‌వ‌న్ దృష్టి సారించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీని బలోపేతం చేయాల‌ని భావిస్తున్న ఆయ‌న పార్టీలోని సీనియ‌ర్ల‌తో రాష్ట్ర స్థాయిలో ఏడు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు.

ఈ క‌మిటీల్లో జ‌న‌సేన పార్టీలో ఉన్న విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కు పెద్ద‌పీట వేశారు. త‌మిళ‌నాడు రిటైర్డ్ సీఎస్ రామ్మోహ‌న్‌రావు, విద్యావేత్త అర్హం ఖాన్‌, దళిత ఉద్య‌మ నేత భ‌ర‌త్ భూష‌ణ్‌, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ల‌ను వివిధ క‌మిటీల‌కు ఛైర్మ‌న్‌లుగా నియ‌మించారు.

అనంత‌రం జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిల్లో క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు. ఇక‌, పార్టీ బ‌లోపేతానికి కూడా ఆయ‌న నేత‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇంత‌కాలం త‌మ పార్టీపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు స‌రిగ్గా తిప్పి కొట్ట‌లేక‌పోయామ‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌ నుంచి విమ‌ర్శ‌ల‌ను గ‌ట్టిగా తిప్పికొట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మైనా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డం ద్వారా పార్టీని బ‌ల‌ప‌ర్చాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నారు.

ఈ మేర‌కు ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న నాటికి గ్రామ స్థాయిల్లో క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయ శూన్య‌త ఉన్నందున‌, ఈ అవ‌కాశాన్ని జ‌న‌సేన బ‌లోపేతానికి ఉప‌యోగించుకుంటే వైసీపీకి ప్ర‌త్యామ్నాయ‌శ‌క్తిగా ఎద‌గ‌వ‌చ్చ‌ని జ‌న‌సేన కీల‌క నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, వైసీపీ ప్ర‌భుత్వం ఇప్పుడే ఏర్ప‌డినందున కొంత‌కాలం వ‌ర‌కు విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండి, త‌ర్వాత ప్ర‌భుత్వ త‌ప్పులు, వైఫ‌ల్యాల‌పై ఉద్య‌మాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. మొత్తంగా ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకొని పార్టీని బ‌లోపేతం చేసుకునే దిశ‌గా జ‌న‌సేనాని వ్యూహాలు ర‌చిస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle