newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

పంట నష్టపోయిన రైతులకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌..!

26-10-201926-10-2019 09:49:42 IST
2019-10-26T04:19:42.923Z26-10-2019 2019-10-26T04:19:39.808Z - - 14-11-2019

పంట నష్టపోయిన రైతులకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీ వాన‌ల‌తో పంట న‌ష్ట‌పోయిన అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. పంట నీట మునిగిన రైతుల‌ను ఆదుకునేందుకు నిర్ణ‌యించింది. దంచికొట్టిన వాన‌లు చేతికొచ్చిన పంట‌ను నాశ‌నం చేయ‌డంతో రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే, రెండు రోజుల‌పాటు వాన‌లు దంచికొట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల‌ను అతలాక‌త‌లం చేశాయి. ఇదే క్ర‌మంలో చేతికొచ్చిన పంట‌లు నీట మునిగాయి. ఏపుగా పెరిగిన సాగు నేల‌వాలింది. ఆరుగాళ్ల క‌ష్టం నీళ్ల‌పాలైంది. పంట అమ్మి సొమ్ము చేసుకుందామ‌నుకున్న అన్న‌దాత‌కు అప్పుల‌కుప్ప‌లే మిగిలాయి.

దీంతో రైతుల‌కు అండ‌గా నిల‌వాలని నిర్ణ‌యించింది జ‌గ‌న్ స‌ర్కార్. పంట న‌ష్టాల‌పై అంచ‌నావేసి న‌ష్ట ప‌రిహారం ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. స్వ‌యంగా రంగంలోకి దిగిన మంత్రి క‌న్న‌బాబు పంట‌న‌ష్టం తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిల ప‌ర్య‌టించారు.

తూర్పు గోదావ‌రి జిల్లా క‌ర‌ప మండ‌లంలోని ప‌లు గ్రామాల‌ను సంద‌ర్శించారు. నీట మునిగిన పొలాల‌ను, న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను గ‌మ‌నించారు. జిల్లా వ్యాప్తంగా పంట న‌ష్టంపై ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. పంట కోల్పోయిన వారంద‌రికీ త్వ‌ర‌లోనే న‌ష్ట ప‌రిహ‌రం అందిస్తామ‌న్నారు.

ఇటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షం విజ‌య‌న‌గ‌రం జిల్లాను అత‌లాకుత‌లం చేసింది. తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. పొలాల్లోకి వ‌ర‌ద నీరు చేరి పంటలు పాడ‌య్యాయి.

కృష్ణా జిల్లాను వాన ముంచెత్తింది. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పులిగ‌డ్డ అక్విడ‌క్ట్‌ను తాకేలా వ‌ర‌ద‌నీరు ప్ర‌వ‌హిస్తోంది. కృష్ణా ప‌ర‌వాహ‌క ప్రాంతాలైన లంక‌లోనికి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించ‌డంతో పంట‌లు నీట మునిగాయి.

వాణిజ్య పంట‌లైన అర‌టి, బొప్పాయి. గంధ‌, ప‌సుపు పంట‌లు పూర్తిగా దెబ్బ తిన్నాయి దీంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. గుంటూర జిల్లాలోని కొల్లూరు కొల్లిప‌ర‌, భ‌ట్టిప్రోలు మండ‌లాల‌కు వ‌ర‌ద పోటు త‌గిలింది. 2 నెల‌ల వ్య‌వ‌ధిలోనే రెండోసారి పంట ప‌లాల‌ను రెండోసారి పంట పొలాలు పోటెత్త‌డంతో లంక గ్రామ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ‌ర‌ద నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వారికి మ‌ళ్లీ వ‌ర‌ద వ‌చ్చి ఆవేదన మిగిల్చింది.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వాన‌ల ధాటికి పొలాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. పంట‌లు నీట‌మునిగాయి. క‌రెక్టుగా పంట చేతికొచ్చే స‌మ‌యానికి రుణుడు చేసిన దాడికి అన్న‌దాత‌లు విల‌విల‌లాడుతున్నారు. ప్రభుత్వం వెంట‌నే స్పందించి న‌ష్ట ప‌రిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో  అన్న దాత‌లు కాస్త ఊర‌ట చెందుతున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle