newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

పంటల బీమాతో రైతులకు ధీమా... జగన్ నిర్ణయం

27-06-202027-06-2020 14:12:56 IST
Updated On 27-06-2020 17:25:34 ISTUpdated On 27-06-20202020-06-27T08:42:56.363Z27-06-2020 2020-06-27T08:42:48.691Z - 2020-06-27T11:55:34.779Z - 27-06-2020

పంటల బీమాతో రైతులకు ధీమా... జగన్ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రైతులకు మరింత దగ్గరయ్యేందుకు, వారికి కష్టకాలంలో భరోసా ఇచ్చేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోటు బడ్జెట్ ఉన్నా 43వేల కోట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం..తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రె డ్డి మరో కీలక ముందడుగు వేశారు. అమరావతి నుంచి పంటల బీమాపై  సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘాటించారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం రైతులు రూపాయి కడితే చాలు.. రైతులు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ– క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. 

రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ–క్రాప్‌తో‌ అనుసంధానించడం ద్వారా ఖరీఫ్‌ 2019లో 25.73లక్షలు.. 2019–20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది. గత ప్రభుత్వం హయాంలో బీమా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా తెలుస్తోందన్నారు జగన్. 

రైతులు ప్రీమియం చెల్లించిన తర్వాత, మిగిలిన వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించాలి. సీజన్‌ ప్రారంభం కాగానే ప్రీమియం చెల్లింపు జరగాలి. అప్పుడే రైతుకు పరిహారం సక్రమంగా అందుతుంది. అయితే గత ప్రభుత్వం బీమా చెల్లించకపోవడం వల్ల రైతులు, కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్‌ ప్రీమియం రాని పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అందుకే తాను అధికారంలోకి వచ్చాక బీమా కంపెనీలతో చర్చలు జరిపి, అప్పటి ప్రీమియంను చెల్లించి, దాదాపు 5.95 లక్షల మంది రైతులకు ఇవాళ బీమా చెల్లించడం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలోలా రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సమూలంగా మార్పులు తీసుకు వచ్చాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు కారణంగా ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. 

పంటల బీమా చెల్లించాల్సిన గత ప్రభుత్వం విస్మరించిందని, పంటల భీమా ప్రిమీయం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రుల ఆదిమూలపు సురేష్ అన్నారు. రైతుల కంట తడి కష్టం తెలిసే వారే సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు చేస్తున్నారని అది వైఎస్ జగన్ తోనే సాధ్యమైందన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు దేవాలయాలని, వేరుశనగ, జోన్న, శనగ రైతులకు మేలు జరిగిందన్నారు. వ్యవస్థల నిర్విర్యం చేయడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వం పై బురద జల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు రాబోయే రోజుల్లో జగన్ కనుచూపు మేరలో కూడా టీడీపీ కనిపించదన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల 1.20కోట్ల మంది రైతులకు 600కోట్ల పంటల భీమా విడుదలై ప్రయోజనం కలుగుతుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle