newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

పంచాయితీల‌తో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు

18-07-201918-07-2019 07:17:57 IST
Updated On 18-07-2019 11:27:53 ISTUpdated On 18-07-20192019-07-18T01:47:57.491Z18-07-2019 2019-07-18T01:47:50.186Z - 2019-07-18T05:57:53.779Z - 18-07-2019

పంచాయితీల‌తో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించి అధికారంలోకి వ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేత‌ల మ‌ధ్య లుక‌లుక‌లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డికి త‌ల‌నొప్పిగా మారాయి.

తాను గెలిపించుకుంటాన‌నే న‌మ్మ‌కంతో ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అనేక చోట్ల కొత్త అభ్య‌ర్థుల‌ను పోటీలో నిలిపారు. జ‌గ‌న్ హ‌వాతో వీరంతా ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధించారు. ఇప్పుడు ఈ నేత‌లే జ‌గ‌న్‌కు స‌మ‌స్య‌గా మారారు.

ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌నం చేలాయిస్తున్నార‌ని ఆర్థ‌ర్ కొంత అసంతృప్తికి గుర‌య్యారు.

ఆర్థ‌ర్ ద‌ళిత సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో కావాల‌నే ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. త‌ర్వాత పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేశారు.

ప్ర‌కాశం జిల్లాలోనూ పార్టీలో సీనియ‌ర్‌గా ఉంటూ జ‌గ‌న్ వెన్నంటే ఉన్న బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి పంచాయితీ కూడా వైసీపీ పెద్ద‌ల ముందుకు వ‌చ్చింది. శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పోటీకి ఇష్టంగా లేక‌పోవ‌డంతో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి టిక్కెట్ వేణుగోపాల్‌కు ఇచ్చారు.

ద‌ర్శితో పాటు ఆయ‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం సంత‌నూత‌ల‌పాడులోనూ ఆయ‌న‌కు బ‌లం ఉంది.ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు కోసం ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డారు. కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న అసంతృప్తికి గుర‌య్యారు. దీంతో పార్టీ పెద్ద‌లు క‌ల‌గ‌జేసుకొని విష‌యాన్ని సెటిల్ చేశారు.

తాజాగా, రాజ‌ధాని ప్రాంత నేత‌ల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాడికొండ‌ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ మ‌ధ్య వివాదం త‌లెత్తింది. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్నా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఇక్క‌డ కొంత అనుచ‌ర‌గ‌ణం ఉంది.

దీంతో ఇటీవ‌ల నందిగం సురేష్ వ‌ర్గీయులు వేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో లేద‌ని ఎమ్మెల్యే వ‌ర్గీయులు తీసివేయించారు. దీంతో ఇరువురు నేత‌ల అనుచ‌రుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. పర‌స్ప‌రం పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి ఎంపీ నందిగం సురేష్‌పైన జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేసే యోచ‌న‌లో ఉన్నారు. బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో లేకున్నా సురేష్ అన‌వ‌స‌రంగా తాడికొండ‌లో వేలు పెడుతున్నార‌నేది ఆమె ఆరోప‌ణ‌.

ఇక‌, నందిగం సురేష్ వ‌ర్గీయులు ఇసుక అక్ర‌మ ర‌వాణా చేస్తున్నార‌ని సైతం ఆమె ఫిర్యాదు చేయ‌నున్నారు. అవినీతి, అక్ర‌మాల విష‌యంలో సీరియ‌స్‌గా ఉంటున్న జ‌గ‌న్ ఎంత‌టి వారైనా ఉపేక్షించేది లేద‌ని ఇప్ప‌టికే తేల్చి చెప్పారు.

దీంతో సురేష్‌పై ఈ ఫిర్యాదు అందితే జ‌గ‌న్ కూడా సీరియ‌స్‌గానే స్పందించే అవ‌కాశం ఉంది. ఇక నేత‌ల మ‌ధ్య విభేదాల‌ను జ‌గ‌న్ ఎలా చ‌ల్లారుస్తారో చూడాలి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle