నన్నపనేని ఈజ్ బ్యాక్.. రోజా లేని లోటును తీరుస్తుందా..?
13-11-201913-11-2019 14:55:14 IST
2019-11-13T09:25:14.811Z13-11-2019 2019-11-13T09:25:08.351Z - - 15-12-2019

నన్నపనేని రాజకుమారి, ఈమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారంటూ ఉండరు. మొన్నటి వరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా తనదైన ముద్రవేసిన ఈమె ప్రభుత్వం మారడంతో ఆ రాజ్యాంగబద్ద పదవికి రాజీనామా చేసేశారు. అయితే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినవస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన రాజకుమారి అప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలిలో వ్యవహరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజకుమారి ఆ నాడే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అనేవారు. తరువాత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోచేరి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నాడు అనేక పోరాటాలూ చేశారు. ఆ పోరాటాల్లో భాగంగా రాజకుమారి నివాసంపై మహిళా కాంగ్రెస్ నేతలు దాడికూడా చేశారు. టీడీపీలో సైతం కొన్ని సందర్భాల్లో అధినేతతో విబేధించారు నన్నపనేని రాజకుమారి. 2014 ఎన్నికల్లో తన కుమార్తె సుధ వినుకొండ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు రాజకుమారిని శాసనసభ చీఫ్ విప్‌గా నియమించారు. ఆ తరువాత ఆమెకు శాసన మండలి సభ్యత్వాన్ని పునరుద్దరించలేదు. దీంతో రాజకుమారికి టీడీపీ సర్కార్ మహిళా కమిషన్ని కట్టబెట్టారు. మహిళా కమిషన్ పదవి కాలం ముగియడంతో మరోసారి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని రాజకుమారి భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాజకుమారి ఇప్పుడిప్పుడే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో మంచి వాగ్ధాటి ఉన్న మహిళగా ఒకప్పుడు రోజా ఉండేవారు. ఆమె నిష్క్రమణ తరువాత అంతటి మంచి వాగ్ధాటి ఉన్న మహిళా నేతలు టీడీపీలో కరువయ్యారు. దీంతో నన్నపనేని రాజకుమారి ఆ లోటును భర్తీ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని నన్నపనేని రాజకుమారి బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో ఉన్న మహిళలు సైతం రాజకుమారి రీ ఎంట్రీపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వచ్చాక ఇక తన స్టైల్లో అధికారపక్షంపై ఫైరింగ్ మొదలుపెడతారని కార్యకర్తలు భావిస్తున్నారు.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా