newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

నైతిక బాధ్యత లేదా? చంద్రబాబు ఫెవికాల్ బాబు అయ్యారా?

20-06-201920-06-2019 08:38:48 IST
2019-06-20T03:08:48.275Z20-06-2019 2019-06-20T02:45:53.981Z - - 21-01-2020

నైతిక బాధ్యత లేదా? చంద్రబాబు ఫెవికాల్ బాబు అయ్యారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి దిగ్భ్రాంతి ... రాజీనామా 

కాంగ్రెస్ వైఫల్యంపై రాహుల్ మనస్థాపం.. కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాజీనామా

... ఇలాంటి వార్తలు తరచూ మనం వింటుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఇలాంటి వార్తలు మనకు కనిపించవు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నైతిక బాధ్యత మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శలు వచ్చిపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర వైఫల్యం ఆ పార్టీ కీలక నేతలను, కార్యకర్తలను బాగా కలచివేసింది.

కానీ పై స్థాయిలో మాత్రం మచ్చుకైనా అది కనిపించడంలేదని అంటున్నారు. 23 మంది ఎమ్మెల్యేల స్థాయికి పడిపోయింది తెలుగుదేశం బలం. అసెంబ్లీలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం ఎవరు? సీఎంగారు మీరు ఓడిపోవడం ఏంటని? పదే పదే ఆయన అనుకూల మీడియా.. చేసే కామెంట్లు చంద్రబాబునాయుడుకి బాగా అనిపించవచ్చు. కానీ సగటు టీడీపీ క్యాడర్‌కు చికాకు పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.

ఎందుకంటే 130-140 సీట్లు గ్యారంటీ అని బల్లగుద్ది చెప్పిన హైటెక్ బాబు గారి అంచనా ఎక్కడ తప్పింది? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబుకి తెలియలేదా? టెక్నాలజీ మాయలో పడి.. మెషీన్లను నమ్మినట్టుగా మనుషుల్ని నమ్మలేదా? నిజంగా టీడీపీలో ఆత్మపరిశీలన లోపించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంతసేపూ వందలాదిమందిలో టెలికాన్ఫరెన్స్ లు, ఐవీఆర్ఎస్ సందేశాలకు పరిమితమయిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో బొక్కబోర్లాపడ్డారని అంటున్నారు. 

ముఖ్యంగా ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన సమీక్షా సమావేశాల్లోనూ చంద్రబాబు వైఖరి మారలేదు. అందుకే అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతలు కూడా అసహనం వ్యక్తంచేశారు. ఈమధ్యే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా చంద్రబాబు తీరుపై ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో అసంతృ‌ప్తి వ్యక్తంచేశారు.

స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వంత నియోజకవర్గం కుప్పంలో మెజారిటీ ఎందుకు తగ్గిందో తెలుసుకోలేక పోయారు. అంతేకాదు, తన పుత్రరత్నం, మంత్రి స్థాయిలో ఉండి కూడా లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలు కావడం, దానికి బాధ్యత వహించకపోవడం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందనే దెప్పిపొడుపులు పడుతున్నాయి.

పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించి పార్టీ అత్యున్నత పదవికి రాజీనామా చేస్తానన్న సగటు నిర్ణయం కూడా చంద్రబాబు తీసుకోలేకపోయారు. నేనే రాజు, నేనే మంత్రి అన్న రీతిన ఆయన కొనసాగుతున్నారు. నేను లేకపోతే పార్టీ లేదు అన్న ధోరణిలో కుర్చీకి ఫెవికాల్ రాసి మరీ అక్కడే తిష్టవేసుకుని కూర్చున్నారనే విమర్శలు వస్తున్నాయి.

40 ఇయర్స్ పాలిటిక్స్ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు 22 ఎమ్మెల్యేలతో కలిసి తనూ అసెంబ్లీలో కూర్చోవడం, జగన్ అండ్ కో సూటిపోటి మాటలు, ఎత్తిపొడుపులు భరించడం ఎంతవరకూ సమంజసం. కీలకమయిన సమయంలో తప్ప బాబు అసెంబ్లీకి వెళ్ళకపోవడం మంచిదని ఆయన సన్నిహితులు సెలవిస్తున్నారు. అసలు ఆయన ప్రతిపక్షనేతగా ఉండకుండా ఆ బాధ్యతలను ఎవరైనా సీనియర్ నేతకు అప్పగించడం మేలని పార్టీనేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 

కనీసం ఇతర నేతల్లోని నాయకత్వ లక్షణాలను పరిశీలించడానికి, నిశితంగా పరీక్షించడానికి ఇది అనుకూల సమయం. చంద్రబాబు జాతీయ అధ్యక్ష పదవినుంచి తప్పుకుని, ఆ సీటులో టీడీపీలో సమర్ధుడైన నాయకుడికి ఆ కుర్చీ అప్పగించే పని కూడా చేయడంలేదు. 

వైసీపీ ధాటికి తట్టుకుని పార్టీని కాపాడుకున్న నేతలకు కీలక పదవులు అప్పగించవచ్చు.  అంతేకాదు, ఓడిపోయిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా నైతిక బాధ్యత వహించకపోవడం గమనించాల్సిన అంశం.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ సైతం తన ఓటమికి చీమకుట్టిన చందాన కూడా స్పందించలేదు. ఓడిపోయిన కీలక నేతలు సైతం పార్టీ పదవులను ఉడుం పట్టుకున్నట్టుగా వేలాడుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే కొత్త నాయకత్వం ఎంతో అవసరం. 

ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న నేతలు హుందాగా తప్పుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. మరో ఐదేళ్ళపాటు పార్టీ బతికి బట్టకట్టాలంటే కొత్త నాయకత్వం, యువతరం అవసరం. అసలు అవకాశం ఇస్తేనే కదా తమ సామర్ధ్యం బయటకు వచ్చేది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రభంజనానికి ఎదురీదిన నేతలు ఎంతో మంది ఉన్నారు. 23 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఆరుగుర రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో సమర్ధులైన వారిని ఎంపికచేసి జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలోని వివిధ పదవుల్లో కూర్చోబెట్టవచ్చు. 

జిల్లా స్థాయిలో వివిధ వర్గాల వారిని ఎంపికచేసి పార్టీ పదవులను కట్టబెడితే వారి సామర్ధ్యం బయటపడుతుంది. ఎన్నికల సమయంలో, ఎన్నికల ఫలితాలకు ముందు వివిధ రకాలుగా మీడియా ముందు డాంబికాలు పలికిన అధికార ప్రతినిధులను కూడా పక్కన బెట్టాలి. వారి స్థానంలో పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేవారిని పార్టీ అధికార ప్రతినిధులు, రాజకీయాల గురించి అంతగా తెలియకుండా కేవలం ఆర్థికపరమయిన గారడీలు చేసే వారిని దూరంగా ఉంచి కొత్తవారిని నియమించాలి.

కానీ, టీడీపీలో అది జరిగే అవకాశం ఉందా? అంటే అనుమానమే. నైతిక బాధ్యత అనేది టీడీపీలో నేతిబీరకాయలో నెయ్యి చందంగా ఉంటుందని కొందరు కిందిస్థాయి టీడీపీ నేతలే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు తన ధోరణిని మార్చుకుని ప్రతి జిల్లాలో సమర్ధుడైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉంది. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తే తప్ప జవసత్త్వాలు రావనేది ఎక్కువమంది అభిప్రాయం. లేదంటే 23 మంది ఎమ్మెల్యేలు ..13 మంది కావచ్చు., అంతకన్నా తక్కువైనా కావచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పగలం?

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle