newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

17-11-201917-11-2019 10:37:08 IST
2019-11-17T05:07:08.159Z17-11-2019 2019-11-17T05:07:03.910Z - - 15-08-2020

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్టైలేవేరు.. తనకు నచ్చితేగాని ఎవరు చెప్పినా వినడని ఆ పార్టీలోని సీనియర్‌నేతలే చెబుతుంటారు. ఏదైనా పనిచేయాలంటే పూర్తిస్థాయిలో సమీక్షించిన తరువాతనే ముందడుగు వేస్తాడని వైసీపీ నేతల మాట. జగన్‌లోని ఈ స్వభావమే మంత్రులకు షాక్‌నిచ్చిందని ఆపార్టీ నేతల్లో చర్చసాగుతుంది.

ఇటీవల కొందరు మంత్రులు సీఎం జగన్మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లి మనవెంట నిలిచిన కార్యకర్తలకు ఏదోఒకటి మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారంట. దీనికి స్పందించిన జగన్‌.. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఆ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని, ఇంకా ఏం చేద్దామో ఆలోచించి తనకు తెలియజేయాలని మంత్రులకు సూచించినట్లు వైసీపీ నేతల్లో చర్చ సాగుతుంది. పలువురు మంత్రులు ఇదే విషయంపై మళ్లీ ఇటీవల జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

జగన్మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లిన మంత్రులు.. ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో మంత్రులకు అధికారం ఇవ్వాలని కోరారంట. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రులు, సచివాలయ స్థాయిలో సంబంధిత మంత్రులకు అధికారం ఇవ్వాలని జగన్‌కు మంత్రులు ప్రతిపాదనలు చేసినట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతుంది. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు ఈ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలని మంత్రులు జగన్‌ను కోరినట్లు ప్రచారం సాగుతుంది.

అయితే మంత్రుల ప్రతిపాదనను సీఎం జగన్‌ తిరస్కరించినట్లు వైసీపీ నేతల్లో చర్చ సాగుతుంది. మంత్రులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చే అనుమతి ఇస్తే.. అవినీతి ఆరోపణలు వస్తాయని, వాటిని డిమాండ్‌ మేరకు డబ్బులు భారీగా చేతులు మారే అవకాశాలుంటాయని జగన్‌ అన్నట్లు సమాచారం. దాని వల్ల ప్రభుత్వానికి అవినీతి మరక అంటుందని జగన్‌ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

టీడీపీ హయాంలో జరిగిన విషయాన్ని జగన్‌ మంత్రులకు గుర్తుచేసినట్లు తెలిసింది. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు చేసిన పనులు గురించి కథలుకథలుగా చర్చించుకుంటున్నారని, ఈ కమిటీలన్నింటిల్లో టీడీపీ కార్యకర్తలకే ఇవ్వటంతో అవినీతి పెరిగిపోయిందని జగన్‌ మంత్రులకు వివరించారంట.

దీంతో అవినీతి జరుగుతున్నా.. వారించేందుకు అధిష్టానానికి అవకాశం లేకుండా పోయిందని జగన్‌ మంత్రులకు గుర్తుచేశారంట. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో అవినీతి పార్టీగా ముద్రపడిందని, అదే తీరును మనం ప్రవర్తిస్తే.. మనకు కూడా అవినీతి మరకలు అంటే అవకాశాలు ఉంటాయని జగన్‌ మంత్రులకు వివరించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

సచివాలయ ఉద్యోగాల వలే ఔట్‌ సోర్సింగ్‌ను కూడా కలెక్టర్లు సంబంధిత కార్యదర్శులకే వదిలేద్దామని జగన్‌ మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. సంబంధిత కార్పొరేషన్‌కే అధికారం ఇద్దామని జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు పారదర్శకంగా శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని జగన్‌ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్‌ చెప్పిన విషయాలను క్షుణ్ణంగా విన్న మంత్రులు మరోమాట మాట్లాడకుండా వెనుదిరిగి వచ్చినట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతుంది. జగన్‌ ఇలానే వ్యవహరిస్తే కార్యకర్తలకు న్యాయం చేయలేమని, కనీసం పట్టువిడుపు ఉండాలని, అలా కాకుండా అవినీతి జరుగుతుందనే పేరుతో కార్యకర్తలకు ఏమీ దక్కకుండా చేయటం సమంజసం కాదని పలువురు మంత్రులు గుసగుసలాడుకున్నారంట.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle