newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

నేత‌ల త‌ల‌రాత‌లు మార్చే ఫ‌లితాలు

23-05-201923-05-2019 09:16:18 IST
2019-05-23T03:46:18.445Z23-05-2019 2019-05-23T03:46:17.083Z - - 26-06-2019

నేత‌ల త‌ల‌రాత‌లు మార్చే ఫ‌లితాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ‌మంతా ఆరు నెల‌లుగా ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఉంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం ఏడాది ముందునుంచే ఎన్నిక‌ల హ‌డావుడి నెలకొంది. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కొత్త ప‌థ‌కాలు, కార్యక్రమాల‌తో ఏడాది కింది నుంచే ఎన్నిక‌లు రేపే అన్నంత‌లా క‌ష్టప‌డ్డారు. వీరి క‌ష్టానికి ఫ‌లితాం ద‌క్కుతుందో లేదో మ‌రికాసేప‌ట్లో తేలిపోనుంది.

43 రోజుల ఉత్కంఠ‌కు నేటితో తెర‌ప‌డ‌నుంది. ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవ‌రో తేలిపోనుంది. ఈవీఎంల‌లో నిక్షిప్తమై ఉన్న ఓట‌రు తీర్పు బ‌హిర్గతం కానుంది. ఈ ఎన్నిక‌లు ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు కీల‌క నేత‌ల రాజ‌కీయ భ‌విష్యత్ కు ఎంతో కీల‌కంగా మారాయి. మూడు పార్టీల భ‌విష్యత్ ఈ ఎన్నిక‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉన్నాయి.

మ‌రోసారి అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌డం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీల‌కం. ఆ పార్టీ వార‌సుడిగా, భావి ముఖ్యమంత్రి నారా లోకేష్ ఎద‌గాలంటే ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గెలుపొందాలి. ఈసారి ఆ పార్టీ గెలిచినా చంద్రబాబు మారోసారి ముఖ్యమంత్రి అవుతారు. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇది భ‌విష్య‌త్ లో నారా లోకేష్ కు రాజ‌కీయంగా చాలా అవ‌స‌రం.అందుకే ఈ ఎన్నిక‌ల్లోనూ వైసీపీని ఓడించి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేకుండా చేసుకోవాల‌ని టీడీపీ వ్యూహాలు అమ‌లు చేసింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక‌లు ఎంత ముఖ్యమైన‌వో చెప్పాల్సిన ప‌నిలేదు. పార్టీ స్థాపించిన తొమ్మిదేళ్లుగా అధికారంలో లేకున్నా జ‌గ‌న్ పార్టీని కాపాడుకుంటూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిన‌ప్పుడే వైసీపీ భ‌విష్య‌త్ పై అనేక అనుమానాలు త‌లెత్తాయి. అయినా, పాద‌యాత్ర చేసి పార్టీని మ‌ళ్లీ జ‌గ‌న్ కాపాడుకున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి కొంత సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటిని వినియోగించుకోలేక వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఖాయ‌మై. మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌గ‌న్ తో ఉండేవారెవ‌రో చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకే జ‌గ‌న్ రాజ‌కీయంగా జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా భావించి ఈ ఎన్నిక‌ల్లో పోరాడారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ జీవితానికి కూడా ఈ ఎన్నిక‌లు ఎంట్రెన్స్ టెస్టు లాంటివి. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు లేకున్నా గౌర‌వ‌ప్రద‌మైన స్థానాలు గెలుచుకుంటేనే ఆ పార్టీ భ‌విష్యత్ బాగుంటుంది. రెండుమూడు స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమితం అయితే మాత్రం జ‌న‌సేన పార్టీకి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తడం ఖాయం. మ‌రి, ముగ్గురు నేత‌ల త‌ల‌రాత‌ల‌ను మార్చే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌రివైపు ఉన్నారో మ‌రికాసేప‌ట్లో తేలిపోనుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle