newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

నేత‌లు చేరితే ఓట్లు రాలతాయా..?

23-06-201923-06-2019 09:19:49 IST
2019-06-23T03:49:49.278Z23-06-2019 2019-06-23T03:39:40.443Z - - 20-09-2019

నేత‌లు చేరితే ఓట్లు రాలతాయా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లం పుంజుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను పార్టీలో చేర్చుకొని టీడీపీలో ముస‌లం పుట్టించింది. ఏకంగా టీడీపీ రాజ్య‌స‌భ పార్టీనే త‌మ పార్టీలో విలీనం చేయించేసుకుంది.

ఇక‌, మ‌రింతమంది త‌మ పార్టీలోకి వ‌స్తున్నార‌ని, చాలామంది సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి చంద్ర‌బాబు తిరిగి వ‌చ్చే వ‌ర‌కు ఆ పార్టీలో చాలామంది నేత‌లు బీజేపీలోకి వ‌స్తార‌ని ధీమాగా చెబుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ పార్టీ బ‌లం పుంజుకుంటుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తే బీజేపీ వ్యూహం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో అనుమాన‌మే. నేత‌లు చేరితే బీజేపీ బ‌లం పెరుగుతుంద‌నుకోవ‌డం, వైసీపీకి ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌నుకోవ‌డం త‌ప్పే అవుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇప్పుడు బీజేపీలో చేరిన న‌లుగురు పార్ల‌మెంటు స‌భ్యుల్లో ముగ్గురు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన నాయ‌కులు కారు. న‌లుగురూ ప‌క్కా వ్యాపార‌వేత్త‌లు. వ్యాపార‌వేత్త‌ల‌కు రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చే సంప్ర‌దాయాన్ని అవ‌లంభించే చంద్ర‌బాబు వీరిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఒక్క టీజీ వెంక‌టేష్ కు మాత్రం క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కొంత ప‌ట్టుంది. ఆయ‌న‌కు మిన‌హా మిగ‌తా ముగ్గురికీ ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఇంచుమించూ ఒకే స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వ‌ని కార‌ణంగా బీజేపీ ప్రజ‌ల్లో విల‌న్‌గా ఉంది. అందుకే ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నోటాతో పోటీ ప‌డింది.

ఒక‌వేళ నేత‌లు వ‌స్తే ఓట్లు, సీట్లు వ‌స్తాయ‌నుకుంటే ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఒక‌టి రెండు సీట్లైనా గెలుచుకునే అవ‌కాశం ఉండేది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వంటి వారు కూడా డిపాజిట్లు కోల్పోయారంటే ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ ప‌ట్ల ఎంత‌గా వ్య‌తిరేక‌త ఉందో ఆర్థం చేసుకోవ‌చ్చు.

బీజేపీకి ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో కొంత క్యాడ‌ర్‌, ఆరెస్సెస్ సానుభూతిప‌రులు ఉంటార‌నేది వాస్త‌వం. అయితే, రాష్ట్రంలో పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుంటే త‌ప్ప ఇత‌ర పార్టీల నుంచి నేత‌లను చేర్చుకుంటే పెద్ద‌గా బీజేపీకి ఒరిగేది ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

రాష్ట్రానికి న్యాయం చేశామ‌ని ప్ర‌జ‌ల్లో నిరూపించుకొని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డం మిన‌హా బీజేపీ బ‌లోపేతం అవ‌డానికి మ‌రో రూట్ లేదంటున్నారు. అలా కాక‌పోతే ఇప్పుడు చేరే నేత‌లు కూడా క‌న్నా, పురందేశ్వ‌రి వంటి వారిలా మిగిలిపోవ‌డం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle