newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

నేతల తీరుతో బాబుకు తలవంపులు....

06-03-201906-03-2019 12:56:24 IST
2019-03-06T07:26:24.928Z06-03-2019 2019-03-06T06:47:10.576Z - - 21-08-2019

నేతల తీరుతో బాబుకు తలవంపులు....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ తెలుగుదేశం పార్టీలో కొందరి తీరు సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందంటున్నారు. అధికార పార్టీ అన్న ఆనందంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఈ నేతల సొంత నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి. బాపట్ల టీడీపీ నేత, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రవర్తన కార్యకర్తలకు అంతు చిక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి బాపట్ల అసెంబ్లీ సీటు టిక్కెట్ ఆశిస్తున్న అన్నం సతీష్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయని స్థానిక ప్రజలే చెబుతున్నారు. 

నియోజకవర్గంలోని యాజలి గ్రామానికి చెందిన 11 ఎకరాల 66 సెంట్ల ప్రభుత్వ భూమిని, తనదిగా పత్రాలు పుట్టించి ఓ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయలు అప్పు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అతనిపై వార్తలు రాసిన ఓ పత్రిక, ఛానల్ జర్నలిస్టులను బెదిరించారనేది కూడా అన్నం మీదున్న మరో ఆరోపణ. అలాగే సినీ డైరెక్టర్ కొరటాల సందీప్ పుట్టిన రోజున సూర్యలంకలోని ఏపీ టూరిజం రిసార్ట్స్ దగ్గర జరిగిన గొడవలో అన్నం సతీష్ అడ్డగోలుగా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. 

ఇక దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ప్రవర్తన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ప్రభుత్వ అధికారి వనజాక్షి మీద దాడి, ఇసుక అక్రమ రవాణా, తాజాగా దళితులను తిట్టిన వైనం... ఇవన్నీ చింతమనేనికే కాదు, టీడీపీకి కూడా తలవంపులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా దళితులను తిట్టిన ఉదంతాన్ని ఎలా ఎదుర్కోవాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. ప్రచారానికి వెళ్లినప్పుడు దళితులు చింతమనేని అంశాన్ని లేవనెత్తితే, ఏం సమాధానం చెప్పాలన్నది కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. 

ఇక కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెనమలూరు ఎంఎల్ఏ బోడే వెంకటేశ్వరరావు, భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎంఎల్ఏ పీలా గోవింద్... ఇలా పలువురి వ్యక్తిగత వ్యవహారాలు, ఆరోపణలు, కేసులు, అధికారి పార్టీకి తలవంపులు తెచ్చి పెడుతున్నాయి. వీరిని చూసి కిందస్థాయి కార్యకర్తలు రెచ్చిపోవడం చాలా చోట్ల పరిపాటి అయింది. మొన్నటి దాకా ఏదో రకంగా సర్దుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు ఎన్నికల సమయంలో వీరి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle