newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

నేతలతో వాలంటీర్ల కుమ్మక్కు.. రైతు భరోసా స్వాహా ?!

15-05-202015-05-2020 15:51:37 IST
Updated On 15-05-2020 16:52:43 ISTUpdated On 15-05-20202020-05-15T10:21:37.332Z15-05-2020 2020-05-15T10:21:34.820Z - 2020-05-15T11:22:43.803Z - 15-05-2020

నేతలతో వాలంటీర్ల కుమ్మక్కు.. రైతు భరోసా స్వాహా ?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతును రాజుని చేస్తామంటూ తాను నమ్మిన నవరత్నాలలో ఒక రత్నంగా రైతుకి అండగా ఉంటామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రైతు భరోసాలో భారీ అవకతవకలు జరిగాయా? పారదర్శకత అంటే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందుగా ఘంటాపదంగా చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో సౌలభ్యం కోసమే వాలంటీర్లు అంటూ మరో కొత్త వ్యవస్థనే సృష్టించారు.

కానీ ఇప్పుడు ఆ వాలంటీర్లే స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలను దిగమింగేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతుల పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నట్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే బాధిత రైతులతో పాటు స్థానిక ప్రతిపక్ష పార్టీల నేతలు.. పై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం లేదంటూ వాపోతున్నారు.

ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు కుటుంబానికి 12500 పెట్టుబడి సాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక అది ప్రధాని కిసాన్ పథకంతో కలిపి అమల్లోకి తెచ్చారు. అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చేది 6500 మాత్రమే.. దీనిపై విమర్శలు రావడంతో మరో వెయ్యి అదనం అంటూ కొద్దిగా ఏమార్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇప్పుడు విడతల వారీగా 13500 కుటుంబానికి అందించాల్సి ఉంది.

కాగా ఈ పథకంలో లొసుగులు ఎక్కువగా ఉన్నాయని.. స్థానిక నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని పథకం మొదలైన తొలిరోజుల్లోనే వినిపించింది. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అది కాస్త పెరిగి పెద్దదై కౌలు రైతులను అడ్డం పెట్టుకొని కోట్లలో దోపిడీకి తెగబడినట్లుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా వాలంటీర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ దోపిడీకి తెగబడుతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ అక్రమాలు కూడా ఎంత తెలివిగా.. ఎంతో చాకచక్యంగా ఈ దందా సాగుతుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వారి పట్టాదారు వివరాలు, ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. కుటుంబ వివరాలతో సహా అన్నీ వాలంటీర్ల వద్దే ఉన్నాయి. లేకపోయినా వారు అడిగితే చచ్చినట్లు ఏదైనా ఇవ్వాల్సిందే. దీంతో కౌలు రైతులు అనే అప్షన్ ద్వారా తన దోపిడీని మొదలుపెట్టారు. దీనిని ఒక క్రమ పద్ధతిలో అవలంభిస్తున్నారని చెప్పారు.

ముందుగా తమ పంచాయతీ పరిధిలో తమ వద్ద ఉన్న భూవివరాలలో స్థానికంగా నివాసం లేని వారు... ఉన్నా తమ మాట వింటారు అనుకున్న వాళ్ళని ఓ లిస్ట్ తయారుచేస్తారు. వారి పట్టాదారు వివరాలను తమకు అనుకూలమైన అదే పంచాయతీకి చెందిన వారిపై కౌలు దారులుగా రికార్డులకు ఎక్కించారు. తమకి అనుకూలమైన వారిపై వచ్చిన రైతు భరోసాను కౌలు రైతులుగా ఉన్న వ్యక్తులతో కలిసి వాలంటీర్లు, నేతలు దింగమేస్తున్నారు.

అది కూడా పంచాయతీలో జనాభా ప్రాతిపదికనే ఈ దందాకు ఒక పరిధిని కూడా సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు 1500 ఓటింగ్ ఉన్న పంచాయతీలో గరిష్టంగా పదిలక్షలకు మించకుండా ఈ దోపిడీకి లిమిట్ పెట్టుకున్నారు. ఆపై జనాభా పెరిగేకొద్దీ తమ దోపిడీ పరిధిని పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే మొత్తంలో తాము సృష్టించిన కౌలు రైతుకి రెండు వేలలోపే చేతిలో పెట్టి మిగతా పదివేలను వాలంటీర్లు, నేతలు కలిసి పంచుకుంటున్నారట.

ఒకవేళ కౌలు రైతులుగా సృష్టించిన వారు అడ్డం తిరిగినా.. అసలైన యజమానులుగా ఉన్న భూ పట్టాదారులు విషయం తెలుసుకొని వాలంటీర్లను నిలదీసినా బెదిరింపులు షరామామూలే. పెన్షన్ల నుండి అమ్మ ఒడి వరకు అన్నీ తమ చేతుల్లోనే ఉన్నాయని.. ఫిర్యాదులు అంటూ అధికారుల వరకు వెళ్తే మిగతా పథకాలు అందకుండా చేస్తామని నేతలతో కలిసి వాలంటీర్లు బెదిరింపులకు కూడా వెనకాడడం లేదని చెప్తున్నారు.  

ఇది రాష్ట్రంలో ఒక్క జిల్లాకో ఒక మండలానికో పరిమితం కాలేదని తెలుస్తుంది. సీఎం సొంత జిల్లా కడప నుండి రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఈ దోపిడీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మిగతా జిల్లాలలో కూడా ఈ దందా కొనసాగుతున్నా కాస్త ఆలస్యంగా మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ అక్రమాలపై ఇప్పటికే వ్యవసాయ అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కూడా పలుచోట్ల ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ముమ్మరంగా ఉన్నందున విచారణ చేయలేమని.. పరిస్థితులు చక్కబడిన తరవాత విచారణకు ఆదేశిస్తామని చెప్తున్నారు. అయితే.. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో భాగమైన వాలంటీర్లను ప్రభుత్వ అధికారులు ఆదేశించే పరిస్థితి రాష్ట్రంలో లేదని బాధితులు వాపోతున్నారు. కౌలు రైతులకు ఇచ్చే భరోసాలో కేంద్రం వాటా కూడా లేదని తమ ప్రభుత్వమే ఈ డబ్బు ఇస్తుందని.. తమదే రాజ్యమన్నట్లుగా వీరి మాటలు ఉండడం విశేషం.

పారదర్శకత.. అవినీతి నిర్మూలన అని చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాలో అవకతవకలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమ పథకాల అమలు, పారదర్శకత కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ అవినీతికి వాలంటీర్లు ఆద్యులుగా మారుతున్నారు. ఇప్పటికే గతఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లోనే ఈ ఆరోపణలు వినిపించినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు అది కాస్త కుంభకోణం స్థాయికి చేరింది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? అన్నదే ప్రశ్న!

 

 

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

   4 hours ago


ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

ఎంసెట్ నిర్వహణపై ఏపీ సర్కార్ మల్లగుల్లాలు

   5 hours ago


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే కరోనా కిట్

   5 hours ago


సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

   7 hours ago


ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రులివే!

   7 hours ago


కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

కరోనా ఎఫెక్ట్... పిల్లలా....అప్పుడే వద్దులే!

   8 hours ago


కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

కడప ఎయిర్ పోర్ట్‌కు మహర్దశ పట్టనుందా?

   8 hours ago


5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

5 వేల‌కు పైగా ఎన్‌కౌంట‌ర్‌లు..నేర‌స్థుల‌పై యోగీ మార్క్ ట్రీట్‌మెంట్‌

   9 hours ago


గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

గ్రేటర్ గజగజ.. కరోనా హాట్‌స్పాట్‌గా హైదరాబాద్

   9 hours ago


కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

కోవిడ్ రోగులకు నరకం చూపించిన ఫాతిమా హాస్పిటల్

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle