newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

నెవ్వర్ బిఫోర్.. సీఎం హోదాలో సీబీఐ కోర్టులో జగన్!

10-01-202010-01-2020 13:39:23 IST
2020-01-10T08:09:23.777Z10-01-2020 2020-01-10T08:09:20.578Z - - 19-01-2020

నెవ్వర్ బిఫోర్.. సీఎం హోదాలో సీబీఐ కోర్టులో జగన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారైనా కోర్టుకు వస్తారా? లేక గత ఏడాదిలాగానే ఈ వారం కూడా సాకులు చూపి కోర్టుకి డుమ్మా కొడతారా? జగన్ సీఎం హోదాలో కోర్టు బోనులో నిలబడితే రాష్ట్రంలో వైసీపీ రాజకీయంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది? గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సాగిన రాజకీయ చర్చలలో ఇదే కీలకం. కాగా, చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టులో అడుగుపెట్టారు.

అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఏపీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రతి చార్జ్‌‌షీట్ లో ఏ-1 నిందితుడిగా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి.. ఆ కేసులలో మరో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులు కొండా మురళి, సురేఖ కూడా కోర్టుకు చేరుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి చివరికి గత ఏడాది మార్చిలో కోర్టు విచారణకి హాజరుకాగా అక్కడి నుండి ఏవో సాకులతో వ్యక్తిగత హాజరు కాకుండా వస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చాయి. ఒకదశలో సిబిఐ కోర్టు సీరియస్ అయి బెయిల్ రద్దు చేస్తుందని ప్రచారం జరిగినా జగన్ కోర్టుకి రాలేదు.

అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదనరావు గత వారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సహా నిందితులతో సహా నిందితుడు జగన్ హాజరుకావాల్సిందేనని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఈరోజు విజయసాయి, ధర్మానతో సహా జగన్ సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు జగన్ కోర్టులోనే ఉన్నారు.

కాగా.. ఈ కేసులలో జగన్ మరోసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. గతంలో తన తరపున తన లాయర్ కోర్టుకి హాజరవుతారని చెప్పగా కోర్టు అభ్యర్ధన తిరస్కరించింది. అయితే ఇప్పుడు తన తరపున సహ నిందితుడు హాజరు అవుతారని, తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాది కోరారు. ఈ కేసును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.

మొత్తానికి సుమారు ఏడాది తర్వాత వైస్ జగన్ సీఎం హోదాలో తొలిసారి కోర్టులో అడుగుపెట్టారు. గత మూడు నెలలుగా చర్చలు రేపిన ఈ వ్యవహారంపై ఏపీలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి.. రాజధాని పరిస్థితిలు ఒక్కపక్క.. జగన్ కోర్టు హాజరు మరోపక్క.. ప్రభుత్వం వీటిని ఎలా అధిగమిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle