newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

నెల్లూరు మంత్రులకు కాలం కలిసొస్తుందా?

27-04-201927-04-2019 12:42:19 IST
Updated On 04-07-2019 11:28:55 ISTUpdated On 04-07-20192019-04-27T07:12:19.880Z27-04-2019 2019-04-27T07:05:16.432Z - 2019-07-04T05:58:55.726Z - 04-07-2019

నెల్లూరు మంత్రులకు కాలం కలిసొస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లా మంత్రులు ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికై గ‌త క్యాబినెట్లో బెర్తులు ద‌క్కించుకున్న నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ఈసారి ప్రజాక్షేత్రంలో గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. సోమిరెడ్డి అయితే ఈ ఎన్నిక‌ను జీవ‌న్మర‌ణ స‌మ‌స్యగా తీసుకున్నారు. అందుకే ఆయ‌న‌కు తన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి తాడోపేడో తేల్చుకునేలా పోటీ చేశారు.

అయితే, పోలింగ్ స‌ర‌ళి చూస్తే ఈ ఇద్దరు మంత్రుల‌కు గెలుపు అంత సులువు కాద‌నే అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్దరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ‌ట్టి పోటీ ఇచ్చారు. స‌ర్వేప‌ల్లి నుంచి సోమిరెడ్డి బ‌రిలో నిలిచారు. ఆయ‌న గ‌తంలో ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసినా గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడి నుంచి ఓడిపోయారు. మ‌ధ్యలో 2012లో వ‌చ్చిన కోవూరు ఉప ఎన్నిక‌లోనూ ఓడారు. అంటే వ‌రుస‌గా ఆయ‌న నాలుగుసార్లు ఓట‌మిపాల‌య్యారు.

రెడ్డి వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం, సీనియ‌ర్ నేత అయినందున వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడినా సోమిరెడ్డికి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఈ ఎన్నిక‌ల్లో ఐదోసారి ఓడిపోవ‌ద్దని సోమిరెడ్డి కంక‌ణం క‌ట్టుకొని ప‌నిచేశారు. త‌న శ‌క్తియుక్తుల‌న్నీ ప్రయోగించారు. అయితే, ఆయ‌న‌కు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధన్ రెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ గెలుపోట‌ముల‌ను ప్రభావితం చేసే ఓ వ‌ర్గం వైసీపీకి అండ‌గా ఉంది. దీనికి తోడు జిల్లాలో వైసీపీ హ‌వా వీచింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. దీంతో సోమిరెడ్డికి విజ‌యం అంత సులువు కాదంటున్నారు.

నెల్లూరు అర్బన్ నుంచి మ‌రో మంత్రి నారాయ‌ణ పోటీ చేశారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఉద్దేశ్యంతో చాలారోజులుగా నారాయ‌ణ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టారు. మంత్రిగా ఆయ‌న‌కు ఉన్న అవ‌కాశంతో నెల్లూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. నెల్లూరు ప‌ట్టణంలో గ‌తంలో ఎన్నడూ జ‌ర‌గ‌నంత అభివృద్ధి ఇటీవ‌లి కాలంలో నారాయ‌ణ చేశార‌ని ప్రజ‌లు సైతం గుర్తించారు. దీనికి తోడు నారాయ‌ణ డ‌బ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేశార‌ట‌. వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాద‌వ్ ఆర్థికంగా నారాయ‌ణ‌ను ఢీకొట్టే స్థాయిలో లేరు. అయినా నారాయ‌ణ‌ను ఎట్టి ప‌రిస్థితిలో ఓడించాల‌ని జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేత ఒక‌రు అనిల్‌కు ఈ విష‌యంలో స‌హ‌క‌రించ‌డంతో నారాయ‌ణ‌కు ధీటుగా కాక‌పోయిన అనిల్ కూడా డ‌బ్బు విష‌యంలో వెన‌క్కు త‌గ్గలేదంటున్నారు.

అయితే, నారాయ‌ణ‌కు డ‌బ్బు, అభివృద్ధి చేశార‌నే పేరు క‌లిసివ‌చ్చింది. అనిల్‌కు  నియోజ‌క‌వ‌ర్గంలో మాస్ ఇమేజ్ ఉంది. అందరికీ అందుబాటులో ఉంటార‌ని, ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా స్పందిస్తార‌నే పేరుంది. దీంతో యువ‌త‌, మాస్ ఓట‌ర్లు అనిల్ వైపు నిలిచార‌నే అంచ‌నాలు ఉన్నాయి. మొత్తంగా నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల‌కూ గెలుపు సులువుగా క‌నిపించ‌డం లేదు. ఈసారి ఎమ్మెల్సీగా కాకుండా ప్రజాక్షేత్రంలో గెల‌వాల‌నే మంత్రుల ప‌ట్టుద‌ల ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle