newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

నెల్లూరు కోటంరెడ్డి ఇక అమరావతికే పరిమితమా?

10-10-201910-10-2019 09:59:09 IST
Updated On 10-10-2019 14:52:36 ISTUpdated On 10-10-20192019-10-10T04:29:09.321Z10-10-2019 2019-10-10T04:29:04.103Z - 2019-10-10T09:22:36.301Z - 10-10-2019

నెల్లూరు కోటంరెడ్డి ఇక అమరావతికే పరిమితమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరి నెలలు గడుస్తున్న కొద్దీ పలు జిల్లాలలో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఆమధ్య ఎంపీ-ఎమ్మెల్యే మధ్య వివాదం గుంటూరు జిల్లాలో దుమారం రేపి ఏకంగా కోర్టులకు ఎక్కారు. చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని పంచాయతీ చేసి ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు స్థబ్ధుగా ఉన్నారు. 

అదలా ఉండగానే నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆగి రాజుకుంది. కాదు కాదు అగ్గి ఎప్పుడో రాజుకున్నా ఓ ప్రభుత్వోద్యోగి మీద దౌర్జన్యంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న రసవత్తర పోరు తెరమీదకొచ్చింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే సర్వేపల్లి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన రెడ్డి.

ఈ ఇద్దరి మధ్య రాజుకున్న అగ్గి జిల్లా మొత్తాన్ని చుట్టేయక ముందే మేల్కొన్న అధిష్టానం ఈ రెడ్డిగారి పంచాయతీని మరో ఇద్దరు సీనియర్, ముఖ్యనేతలకు అప్పగించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి కాగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి జనరల్ సెక్రటరీ మరియు పార్టీ విధేయుడు. అందుకే సీఎం జగన్ ఆ పంచాయతీ ఈ ఇద్దరికీ అప్పగించారు. రెండు నియోజకవర్గాల ద్వితీయ స్థాయి నేతలతో సహా అందరినీ అమరావతికి పిలిపించిన అధిష్టానం సుబ్బారెడ్డి ఇంట్లో పంచాయతీ పెట్టారు. సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపి ఇద్దరినీ ఒక్కటి చేశారు.

అందరూ మీడియా ముందుకొచ్చి సంతూర్ యాడ్ లో మమ్మీలా.. గొడవలా మాకా.. అబ్బే లేనేలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఒకరు మా మేనత్త కొడుకంటే.. మరొకరు నా బావ మరిది అంటూ అక్కడిక్కడే తెగ కలిపేసుకున్నారు. మా ఇద్దరి మధ్య గొడవాలంటూ వస్తే దానికి మరొకరి పరిష్కారం అక్కర్లేదని.. మేమే తీర్చుకొనేంత సాన్నిహిత్యం కూడా ఉందన్నారు. 

అంతేకాదు మా ఇద్దరి మధ్య మరో ఇద్దరు గొడవలు పెట్టేందుకు ప్రయత్నించారని కొత్త ఎపిసోడ్ తెరమీదకి తెచ్చారు. మరి ఇక్కడ ఎందుకు కలిసారయ్యా అంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు అంటూ పులిహోర కలిపేశారు. ఇదంతా మీడియా ముందు వ్యవహారం.

అయితే అసలు ఆ నాలుగు గోడల మధ్య ఏ జరిగిందన్నది ఆ నలుగురికి తెలియాలి. లేదా ఆదేశించిన అధిష్టానికే చెప్పాలి. కానీ రాజకీయం అన్నాక ఊహాగానాలు రాకుండా ఉంటాయా? ఈ పంచాయతీలో ఇలా జరిగిందంటూ అమరావతి పరిసరాలలో ఓ టాక్ బయలుదేరింది. అదే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని కొన్నాళ్ళు అమరావతికి పరిమితమవ్వాలని ఆదేశించారట. 

సర్వేపల్లి మీద ఫోకస్ తగ్గించి అమరావతి నుండి జిల్లా కార్యక్రమాలను సమీక్షించుకొనే బాద్యతను అప్పగించారట. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరస వివాదాలలోకి వస్తుండడంతో కోటంరెడ్డిని మందలింపు ధోరణిలోనే పెద్దలు జిల్లాకు దూరంగా ఉండమన్నారట.

కథనాలకు బలం చేకూర్చేలా కోటంరెడ్డి కూడా ఇకపై నెలకు ఇరవై ఐదు రోజులు అమరావతిలోనే ఉండనున్నానని చెప్పుకొచ్చారు. కాకాణి కూడా గొడవల్లేవ్ కానీ ఇకపై కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటామని.. ఒకరు జిల్లాలో మరొకరు అమరావతిలో జిల్లా పనులను చూసుకోలేనా కలిసి పనిచేస్తామన్నారు. అయితే ఓ ఎమ్మెల్యేకి ఇరవై ఐదు రోజులు రాజధానిలో ఏం పని ఉంటుంది? ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు కూడా దగ్గరలో లేవు. మరి ఇది నియోజకవర్గానికి దూరంగా ఉండమని చెప్పకనే చెప్పినట్లే కదా! ఎందుకొచ్చిన గోల ఏదో ప్రమోషన్ మీద రాజధానికి పంపించారనుకుంటేపోలే!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle