newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

22-01-202022-01-2020 16:44:39 IST
Updated On 23-01-2020 12:05:31 ISTUpdated On 23-01-20202020-01-22T11:14:39.023Z22-01-2020 2020-01-22T11:14:36.857Z - 2020-01-23T06:35:31.357Z - 23-01-2020

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి కంచుకోట‌లా ఉంది. ఆది నుంచీ వైసీపీకి నెల్లూరు అండ‌గా నిలుస్తోంది. వైసీపీకి రెండు ఎంపీని, రెండో ఎమ్మెల్యేని ఇచ్చింది నెల్లూరు జిల్లానే. 2014లో వైసీపీ ఓడినా నెల్లూరు జిల్లాలో మాత్రం మెజారిటీ స్థానాల‌ను గెలుచుకుంది.

2019 ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంత‌లా వైసీపీకి ప‌ట్టున్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త క‌ల‌హాలు న‌ష్టం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట‌నే న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనే ఆ పార్టీ న‌ష్టపోయే అవ‌కాశం ఉంది.

నెల్లూరు జిల్లా వైసీపీ నేత‌ల మ‌ధ్య అంతర్గ‌త విభేదాలు, పార్టీ అధిష్ఠానం మ‌ధ్య నేత‌ల అసంతృప్తి పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఎమ్మెల్యేలు కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి మ‌ధ్య విభేదాలు ఇటీవ‌ల ర‌చ్చ‌కెక్కాయి. ఆరోప‌ణ‌లు, కేసుల వ‌ర‌కు వివాదం వెళ్లింది.

త‌ర్వాత సీనియ‌ర్ నేత ఆనం రాంనారాయ‌ణరెడ్డి మీడియా ముందే జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌పై ప‌రోక్షంగా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పార్టీ ఇరుకున ప‌డింది. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యి ఒకానొక ద‌శ‌లో షోకాజ్ నోటీసు కూడా ఇవ్వాల‌నుకున్నారు.

త‌ర్వాత ఆనం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసి వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింది. నెల్లూరు జిల్లా వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టిన జ‌గ‌న్ జిల్లా ఇంఛార్జి మంత్రిని కూడా మార్చారు.

మొద‌ట జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత స్థానంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు నేత‌ల మ‌ధ్య వివాదాలు బ‌య‌ట ప‌డ‌టం లేదు కానీ నేత‌ల అసంతృప్తి మాత్రం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇటీవ‌ల కోవూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇత‌ర పార్టీల నేత‌లు వైసీపీలో చేరారు.

స్థానిక ఎన్నిక‌ల ముందు ఇలా చేర‌డం ద్వారా ముందునుంచీ పార్టీలో ఉన్న త‌మకు అన్యాయం జరుగుతుంద‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి వ‌ద్ద వాపోయారు. వారితో మాట్లాడుతూ ప్ర‌స‌న్నకుమార్ రెడ్డి కూడా త‌న మ‌న‌స్సులో ఉన్న అసంతృప్తిని క‌క్కేశారు.

ముందునుంచీ వైసీపీకి అండ‌గా ఉన్న వారికి కాకుండా వెనుక వ‌చ్చిన నేత‌ల‌కు, గ‌తంలో వైఎస్ కుటుంబాన్ని తిట్టిన నేత‌ల‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని కామెంట్స్ చేశారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అసంతృప్తిని ఆయ‌న వెళ్ల‌గ‌క్కారు. అయితే, తాను చివ‌రివర‌కు జ‌గ‌న్ వెంటే న‌డుస్తాన‌ని న‌ల్ల‌పురెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన న‌ల్ల‌పురెడ్డి వైసీపీ స్థాపించిన నాటి నుంచి జ‌గ‌న్ వెంట న‌డిచారు. 2012లో ఆయ‌న ఉప ఎన్నిక‌ను కూడా ఎదుర్కున్నారు. జిల్లాలో వారికి మంచి పేరుంది. ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ఇస్తార‌ని అంతా అనుకున్నారు.

మ‌రో సీనియ‌ర్ నేత ఆనం రాంనారాయ‌ణరెడ్డిని కూడా క్యాబినెట్‌లోకి తీసుకుంటార‌ని అనుకున్నారు. కానీ, మేక‌పాటి కుటుంబం నుంచి గౌత‌మ్‌రెడ్డిని, సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా అనిల్ కుమార్ యాద‌వ్‌కు జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించారు. దీంతో న‌ల్ల‌పురెడ్డి, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డిలో అసంతృప్తి ఉంది.

ఇక‌, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా పార్టీ త‌న‌ను గుర్తించడం లేద‌ని అసంతృప్తిని ఏకంగా అసెంబ్లీలోనే బ‌య‌ట‌పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడ‌టానికి త‌న‌కు స‌రిగ్గా అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న పార్టీ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. ఇది చిన్న విష‌య‌మే అయినా పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి ఉంద‌నే విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. మొత్తానికి త‌న‌కు ప‌ట్టున్న నెల్లూరు జిల్లాపై వెంట‌నే జ‌గ‌న్ దృష్టి పెట్ట‌క‌పోతే పార్టీకి న‌ష్టం త‌ప్పేలా లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle