newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

నెల్లూరుతో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పి త‌ప్పదా..?

01-06-201901-06-2019 12:39:10 IST
Updated On 25-06-2019 12:34:26 ISTUpdated On 25-06-20192019-06-01T07:09:10.521Z01-06-2019 2019-06-01T07:09:08.803Z - 2019-06-25T07:04:26.384Z - 25-06-2019

నెల్లూరుతో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పి త‌ప్పదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్యాబినెట్ కూర్పు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి త‌ల‌నొప్పి వ్యవ‌హారంలానే మార‌నుంది. ఊహించ‌ని రీతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ త‌ర‌పున గెల‌వ‌డంతో క్యాబినెట్ లో బెర్త్ ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది అనేది ఎవ‌రి ఊహ‌ల‌కూ అంతుచిక్కడం లేదు. నెల్లూరు జిల్లా ముందు నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా ఉంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన ఆ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. 

జిల్లాలో 10కి 10 నియోజ‌క‌వ‌ర్గాలు గెలుచుకుని టీడీపీకి అవకాశం లేకుండా చేసింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో స‌గానికి పైగా మంది మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. జిల్లాలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి సీనియ‌ర్ నేత‌గా ఉన్నారు. వెంక‌ట‌గిరి నుంచి ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన ఆయ‌న ఇంత‌కుముందు కిర‌ణ్ కుమార్ రెడ్డి, రోశ‌య్య, వైఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా ప‌నిచేశారు. దీంతో ఆయ‌న క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో ఆయ‌న ఒకసారి నెల్లూరు నుంచి, ఒక‌సారి ఆత్మకూరు నుంచి, మూడుసార్లు రావురు నుంచి విజ‌యం సాధించారు.

ఆరోసారి గెలిచిన ఆయ‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ ఎమ్మెల్యే అయినందున ఆయ‌న‌ను స్పీక‌ర్ ను చేస్తార‌నే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక‌, మేక‌పాటి కుటుంబం ముందునుంచీ జ‌గ‌న్ తో ఉంటోంది. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి వారు జ‌గ‌న్‌తో ప‌య‌నిస్తున్నారు. జ‌గ‌న్ కోసం ఉప ఎన్నిక‌ల‌ను ఎదురుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డికి పార్లమెంటు టిక్కెట్ సైతం ఇవ్వలేదు. 

ఆయ‌న కుమారుడు గౌతం రెడ్డి ఆత్మకూరు నుంచి రెండోసారి, ఆయ‌న సోద‌రుడు చంద్రశేఖ‌ర్ రెడ్డి ఉద‌య‌గిరి నుంచి నాలుగోసారి గెలుపొందారు. గౌతం రెడ్డి జ‌గ‌న్ కు స‌న్నిహితంగా ఉంటారు. దీంతో వీరిద్దరిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని మేక‌పాటి వ‌ర్గం భావిస్తోంది. ఇక‌, న‌ల్లపురెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డి సైతం మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఆయ‌న సైతం టీడీపీని వీడి జ‌గ‌న్ వెంట న‌డిచి ఉప ఎన్నిక‌ను ఎదుర్కున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన న‌ల్లపురెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో కొంత‌క‌లం మంత్రిగా ప‌నిచేశారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే కావ‌డం, ముందునుంచీ జ‌గ‌న్ వెంట ఉండ‌టం, పేరున్న రాజ‌కీయ కుటుంబం కావ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న వ‌ర్గం భావిస్తోంది.

ఇక‌, కావ‌లి నుంచి రెండోసారి గెలిచిన రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జ‌గ‌న్ కు స‌న్నిహితులు. ఆయ‌న కూడా మంత్రివ‌ర్గం రేసులో ఉన్నారు. ఇక‌, గ‌తసారి తిరుప‌తి ఎంపీగా పనిచేసిన వ‌ర‌ప్రసాద్ ఈసారి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న‌పై జ‌గ‌న్ కు మంచి అభిప్రాయం ఉంది. ఆయ‌న కూడా ఎస్సీ కోటాలో మంత్రివ‌ర్గం రేసులో ఉన్నారు. మొత్తంగా జ‌గ‌న్ నెల్లూరు నేత‌ల్లో ఎవ‌రిని మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle