newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్నా.. ఆరోగ్యశ్రీ

18-07-201918-07-2019 12:29:56 IST
Updated On 18-07-2019 15:06:46 ISTUpdated On 18-07-20192019-07-18T06:59:56.253Z18-07-2019 2019-07-18T06:59:54.380Z - 2019-07-18T09:36:46.929Z - 18-07-2019

నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్నా.. ఆరోగ్యశ్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో లక్షలాదిమందికి లబ్ధి చేకూర్చే గుడ్ న్యూస్ చెప్పారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. బడ్జెట్ పై చర్చలో మాట్లాడిన మంత్రి బుగ్గన పింఛన్లకు అధిక నిధులు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించి.. కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. 

తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిందని బుగ్గన వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులు నానా ఇబ్బంది పెట్టారన్నారు. టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే.. ఇక హ్యాపీ సండే ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ పాలనలో ప్రచార ఆర్భాటం ఎక్కువగా జరిగేదన్నారు. ప్రజలు కూడా ‘మేటర్‌ వీక్‌..పబ్లిసిటీ పీక్‌’ అనేవాళ్లని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. అలాగే ఈ ఏడాది నుంచి పశువులకు కూడా బీమా కేటాయిస్తున్నామన్నారు. గొర్రెలకు ఈ ఏడాదే అమలు చేస్తామన్నారు.

వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని ఎంతోమంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. వైఎస్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి.

జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ పథకానికి జీవం పోశారన్నారు. బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ పథకానికి అధిక నిధులు కేటాయించామన్నారు. ఏడాదికి రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. అంటే నెలకు రూ. 40వేల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ ఈ పథకం కిందకు వస్తారు.గతం కంటే మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. 

పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత వైద్య ఖర్చులు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేస్తామని హామీ ఇచ్చారు. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన జగన్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. ఏపీ బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ. 1,740 కోట్లు కేటాయించారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని సీఎం జగన్ వెల్లడించారు.జ

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle