newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

నెంబ‌ర్ 1 అవుతారనుకుంటే ఇలా అయిందే..?

14-11-201914-11-2019 08:10:26 IST
Updated On 14-11-2019 16:03:02 ISTUpdated On 14-11-20192019-11-14T02:40:26.580Z14-11-2019 2019-11-14T02:40:18.434Z - 2019-11-14T10:33:02.824Z - 14-11-2019

 నెంబ‌ర్ 1 అవుతారనుకుంటే ఇలా అయిందే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే త‌న నెంబ‌ర్ 152 అని, జ‌న‌సేన‌లో ఉంటే మాత్రం తాను నెంబ‌ర్ - 1 అని ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నానికి జ‌న‌సేన దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.

స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రంలో ఓట‌మిపాల‌య్యారు. అయితే, జ‌గ‌న్ హ‌వాలోనూ జ‌న‌సేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌.

అంత‌కుముందే ఎమ్మెల్యేగా ప‌నిచేయ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌కు పార్టీ బ‌లం తోడ‌వ‌డంతో ఆయ‌న స్వ‌ల్ప మెజారిటీతో గ‌ట్టెక్కారు. స్వ‌యంగా అధినేత కూడా ఓడిపోయిన జ‌న‌సేన నుంచి గెలిచిన ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే కావ‌డంతో అంద‌రి చూపూ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌పై ప‌డింది. ఆయ‌న‌కు పార్టీలో ఎన‌లేని గౌర‌వం ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. రాపాక కూడా అదే ఆశించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న చేరుతార‌ని ప‌లుమార్లు ప్ర‌చారం జ‌రిగినా తాను జ‌న‌సేన‌ను వీడేది లేద‌ని చెబుతూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు లాయ‌లిస్టుగా ఉంటున్నా రాపాక‌కు మాత్రం పార్టీలో అంత ప్ర‌త్యేక గుర్తింపు ఏమీ ల‌భించ‌డం లేదు.

ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే అయినా ఆయ‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌గా ప్ర‌త్యేకంగా ఏమీ చూడ‌టం లేదు. అంద‌రు నేత‌ల్లో రాపాక కూడా ఒక‌రు అన్న‌ట్లుగా భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించి త‌ప్ప రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ వ్య‌వ‌హారాల్లో రాపాక‌కు ఎటువంటి ప్రాధాన్య‌త లేదు.

రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా రాష్ట్రంలో ఎక్క‌డ ప‌వ‌న్ కళ్యాణ్ ప‌ర్య‌టించినా రాపాక మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఓడిపోయినా నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌కు మాత్రం పార్టీలో బాగా ప్రాధాన్య‌త ల‌భిస్తోంది. ప‌వ‌న్ త‌ర్వాత నెంబ‌ర్ 2 హోదాలో ఆయ‌న క‌నిపిస్తున్నారు.

నాదెండ్ల మ‌నోహ‌ర్ ఛైర్మ‌న్‌గా ఉన్న పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీలో రాపాక స‌భ్యుడిగా మాత్ర‌మే ఉన్నారు. ఇది త‌ప్పించి రాపాక‌కు జ‌న‌సేన‌లో ఇత‌ర ఏ ప‌ద‌వీ లేదు.

తాజాగా, ఇసుక కొర‌త మీద‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌న‌సేన నేత‌లు క‌లిశారు. అయితే, ప‌వ‌న్ వెంట వెళ్లిన బృందంలో ఆ పార్టీ ఏకైక ప్ర‌జాప్ర‌తినిధి రాపాక వ‌రప్ర‌సాద్ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రాపాక వైఖ‌రి కూడా పార్టీకి కొంత ఇబ్బందిక‌రంగానే ఉంది. ఓ వైపు ప్ర‌తీ విష‌యంలోనూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తుంటే రాపాక మాత్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ప్ర‌శంసిస్తున్నారు.

అసెంబ్లీలో జ‌గ‌న్‌ను రాపాక ప్ర‌శంసించిన‌ట్లు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ‌లేదు. ఇటీవ‌ల అయితే జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి స్వ‌యంగా రాపాక పాలాభిషేకం చేశారు. ఈ సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ప‌వ‌న్ రాపాక‌పై అసంతృప్తితో ఉన్నారా లేదా ఆయ‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డానికి ఇత‌ర ఏమైనా కార‌ణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle