newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

‘‘నూటికి వెయ్యిశాతం గెలుపు మాదే’’

20-05-201920-05-2019 15:33:37 IST
Updated On 21-05-2019 15:42:10 ISTUpdated On 21-05-20192019-05-20T10:03:37.161Z20-05-2019 2019-05-20T10:02:52.820Z - 2019-05-21T10:12:10.923Z - 21-05-2019

‘‘నూటికి వెయ్యిశాతం గెలుపు మాదే’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగ్జిట్ పోల్స్ తీరుతెన్నులపై చంద్రబాబు మండిపడ్డారు. 23 జాతీయ ప్రాంతీయ పార్టీలు 50% వీవీ ప్యాట్లను లెక్కించాలని  పోరాటం చేస్తుంటే, ఎన్నికల సంఘం మాత్రం సమయాన్ని సాకుగా చూపించి, లెక్కింపు కుదరదని వాదిస్తోంది. ప్రజాస్వామ్య విలువలను  ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోలేదని చంద్రబాబునాయుుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సర్వేలు చేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని చంద్రబాబునాయుడు అన్నారు. తాము కూడా సర్వేలు చేశామని 35 ఏళ్ళుగా సర్వేలు చేస్తున్నామన్నారు. ఏపీలో గెలుపుపై అనుమానాలు అవసరం లేదన్నారు.  నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

జాతీయ మీడియా సైతం వైసీపీపై మొగ్గుచూపిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీడీపీ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అభివృద్ధి, సంక్షేమం వల్లే టీడీపీ విజయం సాధిస్తుందన్నారు చంద్రబాబు.

తాను ఒక్క పిలుపు ఇస్తే అందరూ వచ్చి అర్ధరాత్రి దాటే వరకూ ఓటు వేశారు. అనేక ఇబ్బందులు పడి తెలంగాణ నుంచి వచ్చి ఓటు వేశారు.  వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని మాజీ సీఈసీ ఖురేషి చెప్పారు. పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాలన్నారు చంద్రబాబు.

మరోవైపు తమ గెలుపుపై టీడీపీ నేతలు కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు.  ఏపీ ఎన్నికలపై నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావని టీడీపీ నేత బుద్దా వెంకన్న చెప్పారు.  130 స్థానాలు గెలిచి తీరుతామని మీడియా సమావేశంలో ఆయన తొడగొట్టి ధీమా వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల ముందు కూడా వైసీపీ నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలారని.. అప్పుడు ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. మరి, ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఏపీలో తీర్పు ఉంటుందా? లేక టీడీపీ నేతల ఆశలను ఫలితాలు వమ్ముచేస్తాయో లేదో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle