newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

నీటి నిల్వకు చంద్రబాబు నిర్లక్ష్యమే శాపమా?

11-11-201911-11-2019 14:53:04 IST
2019-11-11T09:23:04.621Z11-11-2019 2019-11-11T09:22:56.419Z - - 15-12-2019

నీటి నిల్వకు చంద్రబాబు నిర్లక్ష్యమే శాపమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం వైఫల్యాలపై ఏ ప్రశ్న అడిగినా అందుకు చంద్రబాబే కారణమని ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు అందరూ ఒక్కటే సమాధానం చెప్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో రాకుముందు టీడీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సాక్షి పత్రిక ఇప్పుడు ప్రభుత్వంలో తానూ భాగమైంది కనుక తన ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు నేతలతో పాటు సాక్షి పత్రిక కూడా అన్నిటికీ చంద్రబాబే కారణమని క్లారిటీ ఇస్తుంది.

పొరుగు రాష్ట్రాలలో వర్షాలు మన ప్రాజెక్టులను ముంచెత్తగా .. ఆలస్యంగా మన రాష్ట్రంలో కురిసిన వర్షాలతో వచ్చిన వరద సముద్రంపాలైంది. ఏపీ ప్రాజెక్టులలో ఇంకా నిల్వ చేసే కెపాసిటీ ఉన్నా ప్రణాళికలో అమలులో వైఫల్యం కారణంగా సముద్రంలోకి వదిలేశారని అప్పుడే సాగునీటి రంగంలో అనుభవమున్న నిపుణులు తేల్చిచెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ సాక్షికి ఎందుకు గుర్తొచ్చిందో కానీ మరోసారి అందుకూ చంద్రబాబే కారణమని ఓ కథనాన్ని ప్రచురించింది.

గత ప్రభుత్వంలో చంద్రబాబు నీటి కాల్వల వెడల్పుపై దృష్టి పెట్టకపోవడం కారణంగా ఇప్పుడు అనుకున్న రీతిలో నీటిని తరలించి.. ప్రాజెక్టులలో నీటి నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయి.. వృధాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చిందని ఆ కథనం సారాంశం. మరి ఇప్పుడు ఎందుకు ఈ కథనం అంటే ఈ ఏడాదిలో నిల్వ చేసిన సామర్ధ్యంతో సరఫరాలో కొంత కష్టాలు ఉండేలా అవకాశం ఉందని.. అందుకు ముందుగానే చంద్రబాబే కారణమనే ప్రిపేర్ చేసినట్లుగా చూడాల్సి వస్తుంది.

ఈ ఏడాది ఆలస్యంగా వచ్చినా కృష్ణాకు కూడా భారీ వరద వచ్చింది. అంత వరద వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు గోదావరి నీటితో అవసరం ఉండదు. కృష్ణాకు వరద రాకపోయినా ఆలస్యంగా వచ్చిన సందర్భంలో ఉపయోగపడేలా చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారు. ఈ ఏడాది కృష్ణాకు వరద వచ్చినా పట్టిసీమ నుండి నీటిని తోడడం అప్పుడే మొదలుపెట్టారు. అంటే వరదను నిల్వ చేయలేకపోయారని స్పష్టమవుతుంది.

ఇక శ్రీశైలం వరదను సీమకి తరలించి నిల్వ చేయడంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తినట్లుగా అప్పుడే చర్చ జరిగింది. శ్రీశైలంలో 810 ఆడుగుల వద్దే ముచ్చుమర్రి నుండి తరలింపు అవకాశం ఉన్నా ప్రభుత్వం అది చేపట్టలేదు. 860 అడుగులకు చేరిన తర్వాత పోతిరెడ్డి పాడు నుండి పంపింగ్ మొదలుపెట్టారు. ఇవే కాదు బానకచర్ల, హంద్రీనీవా సుజల స్రవంతి, ఎస్ఆర్బీసి, మాల్యాల ప్రధాన లిఫ్ట్ ద్వారా తరలించింది తక్కువగానే కనిపించింది.

ఈ ఏడాది మొత్తం వరదల సమయంలో శ్రీశైలం నుండి తరలించిన నీటిలో సుమారు యాభై టీఎంసీలు కొరతపడినట్లు సాగునీటి నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడి వరదలు వచ్చినా పంటల చివరి సమయంలో నీటి కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సమాధానాన్ని సాక్షి ముందే సిద్ధం చేసి ఉంచుతున్నట్లుగా ఈ కథనాన్ని భావించాల్సి వస్తుంది. కారణం చంద్రబాబే అయినా వైఫల్యం జగన్ బాబుదే అయినా రైతులకు మాత్రం కష్టాలు తప్పవనే అర్ధమవుతుంది!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle