newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమే.. వైసీపీ ఎమ్మెల్యే

07-10-201907-10-2019 11:02:48 IST
Updated On 07-10-2019 12:26:32 ISTUpdated On 07-10-20192019-10-07T05:32:48.214Z07-10-2019 2019-10-07T05:32:43.377Z - 2019-10-07T06:56:32.935Z - 07-10-2019

నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమే.. వైసీపీ ఎమ్మెల్యే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన ఇంటిపై దాడి చేసి, తనను, తన తల్లిని వేధించారంటూ మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎ. సరళ చేసిన ఆరోపణలు నిజమే అని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం ఉందని రుజువైతే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను పార్టీనుంచి బహిష్కరించినా కట్టుబడతానని చెప్పారు. 

ఎంపీడీఓ సరళ ఆరోపణపై ఆదివారం ఉదయం అరెస్టయిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనంతరం బెయిలుపై బయటికొచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి బి. శ్రీకాంత్ యాజమాన్యంలోని ఒక లేఅవుట్‌కి నీటి కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు ఎమ్మెల్యే తన ఇంటిమీదికి వచ్చి తనను బెదిరించారని, వేధించారని సరళ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసారు.

అరెస్టై బెయిల్‌‌పై బయటికొచ్చిన శ్రీధరరెడ్డి ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తనపై ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలిన పక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను పార్టీనుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే చెప్పారు. సరళ ఆరోపణపై ఆధారాలు ఉంటే అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసులను ఆదేశించడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. నెల్లూరు జిల్లా ఎస్పీతో తనకు వ్యక్తిగత మనస్పర్థలు ఉన్నందువల్ల ఈ కేసుపట్ల ఎస్పీ పక్షపాత దృష్టితో వ్యవహరించారని ఆరోపించారు. 

జగన్ వంటి వ్యక్తి నా నాయకుడిగా ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని, అదే సమయంలో ఆయన జిల్లా ఎస్పీకి అధిక స్వాతంత్య్రం ఇవ్వడం నా దురదృష్టం. మా ఇద్దరికీ వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయి. ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆయన నన్ను ఇబ్బందుల్లోకి నెట్టాడని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఎస్పీ గురించి తాను గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

నీటి కనెక్షన్లు ఇవ్వడానికి కాస్త సమయం పట్టేటట్టుందని తాను చెప్పిన తర్వాత వైకాపా ప్రతినిధి శ్రీకాంత్ నేరుగా తనకే ఫోన్ చేసి, ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడించారని, రెండు రోజుల్లో నీటి కనెక్షన్ ఇవ్వాల్సిందే అంటూ తనను బెదిరించారని ఎంపీడీఓ సరళ చెప్పారు. పైగా పార్టీ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తన ఇంటికే వచ్చి తనను, తన తల్లినీ బెదిరించారని, అంతకు ముందు తన ఇంటికి విద్యుత్ సరఫరాను కట్ చేశారని, తన ఇంటి ముందు చెత్తను వెదజల్లారని సరళ ఆరోపించారు.

నీటి కనెక్షన్ ఇవ్వాలని తాను సరళకు చెప్పింది నిజమే కానీ ఆ తర్వాత ఆమె చేసిన ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని ఎమ్మెల్యే ఖండించారు. తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల యూనియన్లు తాను నిజంగా తప్పు చేశానని, సరళను, ఆమె తల్లిని బెదిరించానని రుజువు చేస్తే, బహిరంగంగా సరళకు క్షమాపణ చెప్పడమే కాకుండా, ఆమె తల్లి పాదాలకు మొక్కుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నిజాలు నిగ్గు తేల్చకుండా ఒక వర్గం మీడియా తనపై సాగిస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదేమైన ఒక్కటి మాత్రం నిజం. అధికారులుపై ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు భౌతిక దాడులు తలపెట్టినా చలించకుండా తప్పు వారిపైనే నెట్టేందుకు సాహసించిన గత ప్రభుత్వ వ్యవహారంతో పోలిస్తే ఎంపీడీఓ ఆరోపణ చేసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేపై తగు చర్యలు తీకుకోవాలని నిర్ణయించడం ప్రశంసనీయం. నిజానిజాలు రుజువు కావలసిందే కానీ అన్యాయం జరిగితే వెంటనే స్పందించే అధికార యంత్రాంగం ఉండటమే ప్రజాస్వామ్యానికి నిజంగా శోభ నిచ్చే విషయం.

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   35 minutes ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   an hour ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   an hour ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   an hour ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   3 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   15 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   17 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle