newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

నిరుపేదకు జగన్ టికెట్ ... జనం పట్టం కడతారా?

29-03-201929-03-2019 08:49:32 IST
Updated On 30-03-2019 13:27:25 ISTUpdated On 30-03-20192019-03-29T03:19:32.691Z29-03-2019 2019-03-29T03:18:47.795Z - 2019-03-30T07:57:25.224Z - 30-03-2019

నిరుపేదకు జగన్ టికెట్ ... జనం పట్టం కడతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల ప్రచారంలో భాగంగా దారి ఖర్చులను కూడా భరించలేని నిరుపేద దళితుడైన నందిగం సురేష్ వైఎస్సార్సీపీ తరఫున బాపట్ల పార్లమెంటు బరిలో ఉన్న బలమైన అభ్యర్థి. నందిగం సురేష్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నమొత్తం అభ్యర్థులతో పోలిస్తే చాలా పేదవాడు. ఇడుపుల పాయలో వైసీపీ పార్లమెంటు అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు జగన్ ఈ నందిగం సురేష్‌ను పిలిచి తన పక్కన కూర్చోమని చెప్పాడు. పార్టీలో సాధారణ కార్యకర్త అయిన సురేష్ షాక్ తిన్నాడు. 

కాసేపటి తర్వాత పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా సురేష్ చేతికి ఇచ్చి అనౌన్స్ చెయ్యమన్నాడు. అప్పటికి కాసేపటి ముందే ఆ జాబితాలో తనపేరు ఉందని తెలుసుకొని పూర్తిగా తేరుకోని సురేష్ వణుకుతున్న స్వరంతోనే తన పేరుతో సహా పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాడు. సురేష్‌లో కలిగిన భావోద్వేగాలకు కారణం అతడు రాజకీయ నేపథ్యం ఉన్నవాడు కాదు. నిరుపేద.

రాజధాని అమరావతిలో పంటభూముల్ని ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ పేరుతో లాక్కున్నప్పుడు తిరగబడ్డాడు సురేష్. గుంటూరు జిల్లాలో రాజధాని రైతుల పక్షాన నిలబడి చేసిన పోరాటాల్లో భాగంగా అరెస్టయ్యాడు. ఎప్పటికప్పుడు రాజధాని భూముల విషయంలో టీడీపీ చేసే రాజకీయాలను వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లాడు.

ఈ విషయం తెలుసుకున్న అధికార టీడీపీ సురేష్‌పై కేసులు పెట్టి వేధించింది. జగన్ వైపు నుంచి తమ వైపుకు వస్తే కావాల్సినవన్నీ ఇస్తామని మభ్యపెట్టారని కూడా సురేష్ మీడియాకు చెప్పాడు. కానీ సురేష్ లొంగలేదు. అతనిలోని పోరాట పటిమ జగన్మోహన్ రెడ్డిని బాగా ఆకర్షించింది. ఎన్నోసార్లు నీకు ఏం కావాలో చెప్పు సురేష్ అని అడిగినా సురేష్ నువ్వు సీఎం అయితే నాకు అదే చాలన్నా అని చెప్పేవాడట. అందుకే సురేష్ కోరకపోయినా బాపట్ల ఎంపీ స్థానానికి సురేష్‌ను ఎంపిక చేశాడట జగన్మోహన్ రెడ్డి. 

ఈ విషయం తెలిసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, టిక్కెట్ రేసులో ఉన్నవారు షాక్ తిన్నారట. సురేష్ రూపాయి కూడా ఖర్చుపెట్టలేడు జగన్ అని సలహాలు కూడా ఇచ్చారట. సురేష్ టిక్కెట్ వెనుక జగన్ చాటుకున్నపెద్దమనసు. షెడ్యూల్డు కులాల వ్యక్తికి జగన్ ఇచ్చిన గొప్ప అవకాశం.

ఇక సురేష్ కుటుంబ నేపథ్యం చూస్తే.. స్వగ్రామం గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం. ఐదుగురు సంతానంలో నాలుగోవాడు. నిరుపేదలైన తల్లిదండ్రులు పిల్లల పోషణకే నానా కష్టాలు పడేరోజుల్లో సురేష్ తండ్రి చనిపోయాడు. సురేష్ తల్లి సంతోషమ్మ ఐదుగురు పిల్లల్నిపెంచారు. సురేష్, ఆయన సోదరుడు ఖమ్మంలోని ఎస్సీ హాస్టల్లో ఉండి పదోతరగతి వరకే చదువుకోగలిగారు. ఆ తర్వాత పూటగడవడం కోసం ఫోటోగ్రాఫర్‌గా, వ్యవసాయ కూలీగా చేయనిపనంటూ లేదు. 

చిన్నపాటి పొలమే జీవనాధారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల కారణంగా ఈ కుటుంబం లబ్దిపొందింది. నాటి నుంచి వైఎస్ కుటుంబం అంటే ప్రేమ. ఆ ప్రేమతోనే రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ జెండా భుజానికెత్తుకున్నాడు సురేష్. అతని నిబద్ధత, నిజాయితీ జగన్‌ను ఆకట్టుకున్నాయి.

సురేష్ సైతం ఊహించని విధంగా ఆయన్ను ఎంపీ స్థానానికి నిలబెట్టారు. కొడుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలిసిన సురేష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికీ సురేష్ తల్లి చిన్నాచితక పనులకు వెళ్తారు. సురేష్ అన్న వ్యవసాయ కూలీ. చెల్లెళ్లు పొలం పనులు చేయనిదే ఇల్లు గడవదు. అందుకే తమ బిడ్డ గెలిస్తే పార్లమెంటులోకి వెళ్తాడంటే ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారనీ చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా చేస్తున్న ప్రచారం ఎంత అవాస్తవమో దీన్ని బట్టి ప్రజలకు బాగా అర్థమౌతుందని వైసీపీ నేతలంటున్నారు. ఈ సామాన్యుడిని పార్లమెంటు సభ్యుడిని చేయాల్సిన బాధ్యత ఇప్పుడు బాపట్ల ఓటర్లదే.. !


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle