newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

నిరాధార వార్తలేమిటో జగన్ సర్కార్ డెఫినిషన్ చెప్పగలదా?

01-11-201901-11-2019 11:08:45 IST
Updated On 01-11-2019 17:19:42 ISTUpdated On 01-11-20192019-11-01T05:38:45.617Z01-11-2019 2019-11-01T05:38:33.666Z - 2019-11-01T11:49:42.041Z - 01-11-2019

నిరాధార వార్తలేమిటో జగన్ సర్కార్ డెఫినిషన్ చెప్పగలదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు మీడియా సాధనాల దగ్గర నుండి జాతీయస్థాయి మీడియా సాధనాల వరకు పత్రికా స్వేచ్ఛకు ఈ జీవో కళ్లెం వేస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఒక్క పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ను సైతం ఈ జీవోతో శాసించాలని జగన్ సర్కార్ తాపత్రయపడుతుంది.

తమ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేసినా.. నిరాధార కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా ఆయా సంస్థలు, పబ్లిషర్లు, ఎడిటర్లపై చర్యలు తీసుకొనేందుకు గాను ఆయా శాఖల కార్యదర్శులకు అధికారం ఇవ్వడమే ఈ జీవో సారాంశం. అంటే ఒక విధంగా తనకు వ్యతిరేక వార్తలు రాసే పత్రికలు, చానెళ్లు, సోషల్ మీడియా వింగ్స్ వంటి వాటిని వైసీపీ ప్రభుత్వానికి కానీ.. పార్టీ కానీ ముట్టుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల చేత మీడియాపై కేసులు పెట్టడమే దీని ఉద్దేశ్యం.

మహామహా యోధులు.. నియంతలుగా పేరున్న వ్యక్తులు కూడా ఈ జీవోను తీసుకొచ్చేందుకు వెనకడుగేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇదే తరహా జీవోను తీసుకొచ్చేందుకు ప్రయత్నించి చివరికి వెనక్కు తగ్గారు. ఆ సమయంలో తనకు తెలియకుండానే తన క్యాబినెట్లో ఆ జీవో చర్చకు వచ్చిందని అయన చెప్పుకొని తన స్థాయిని తగ్గించుకున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా జీవోను తెచ్చారు.

ఇది ఒకరకంగా మీడియా సంస్థలకు ప్రభుత్వ అధికారులకు జుట్లు ముడేయడం లాంటిదేనని ప్రముఖులు అభిప్రాయపడుతుండగా మీడియా సంస్థలు మాత్రం నిరాధార వార్తలకు జగన్ సర్కార్ ముందుగా డెఫినిషన్ చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ జీవోను ప్రజాస్వామ్య మూలస్థంభాన్ని కూల్చేయడమేనని భావిస్తున్న ప్రతిపక్షాలు ముందుగా జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికలో ప్రచురించిన, ప్రసారమైన కథనాలకు ఆధారమైనవని చూపించగలరా అని ప్రశ్నిస్తున్నారు.

సాక్షి పత్రిక, ఛానెల్ లో టీడీపీ ప్రభుత్వం, నేతలపై ప్రసారమైన 'ఇసుకాసురులు', 'నారాసుర చరిత్ర', 'కోడికత్తి కేసులో టీడీపీ హస్తం', 'వైఎస్ వివేకా హత్యకేసు లో చంద్రబాబు హస్తం', 'టీడీపీ ఎమ్మెల్యేల వేలకోట్ల అక్రమ సంపాదన', టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనిలో 'వేలకోట్ల అవినీతి' కథనాల దగ్గర నుండి ఏ మాత్రం సంకోచం లేకుండా దిగజారి ప్రచురించి, ప్రసారం చేసిన మాజీ స్పీకర్ ఆత్మహత్యపై 'పాపం పండింది' కథనం నుండి తాజాగా లోకేష్ పై 'చినబాబు చిరుతిండి పాతిక కోట్లు' కథనాల వరకు ఒక్కటైనా నిరూపించబడిందా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పార్టీ చేసిన ఆరోపణలన్నీ సాక్షి పెద్ద పెద్ద కాలమ్స్, గంటలకు గంటలు ఎపిసోడ్స్ ప్రసారం చేసి ఏకిపారేసి నిజమే అనేలా ప్రజలపై రుద్దేశారు. అయితే అందులో ఒక్కటి కూడా నిరూపితం అయిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలను ప్రసారం చేస్తే కేసులా? అంటే నిరూపితమయ్యే వరకు అవి ప్రజలకు తెలియకూడదా? నిరూపితమయ్యేసరికి దశాబ్దాలు పడుతుంది. అంటే అది నిజమే అయినా ప్రజలకు తెలిసేసరికి కాలం కాస్త కరిగిపోతుంది.

అయినా అసలు తప్పు చేయని ప్రభుత్వానికి మీడియా అంటే ఇంత భయమెందుకు? తన పాలన పారదర్శకం అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డికి మీడియా స్వేచ్ఛ అన్నది ప్రజాస్వామ్యంలో భాగమని తెలియదా? లేక ఏ అసత్యపు ప్రచారంతో ప్రజలను నమ్మించారో.. ఇప్పుడు అదే ప్రచారం తనను మింగేస్తుందని భయమా? ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తే కేసులేనని ఈ జీవో ఉద్దేశ్యం. మరి ఇది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని పర్యవసానం ఏంటి? ముందుముందు ఇది ఎటు దారితీస్తుందో చూద్దాం!

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle