newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

29-05-202029-05-2020 11:59:39 IST
Updated On 29-05-2020 12:23:16 ISTUpdated On 29-05-20202020-05-29T06:29:39.366Z29-05-2020 2020-05-29T06:29:35.433Z - 2020-05-29T06:53:16.954Z - 29-05-2020

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావత్‌ ఆంధ్ర రాష్ట్రం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎ్‌సఈసీ) వ్యవహారంపై తుది తీర్పు శుక్రవారం వెలువడింది, ఈ కేసులో ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. జగన్ సర్కార్ కు షాకిచ్చింది. 

ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనల సడలింపు, పదవీ కాలం కుదింపు, కొత్త ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌ -గ్రామీణాభివృద్ధి శాఖ గత నెల 10న జారీ చేసిన 617, 618, 619 జీవోలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో పాటు మొత్తం 13 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ నెల 8వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పును శుక్రవారం వెల్లడించింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో రమేష్ కుమార్ తిరిగి విధుల్లోకి చేరబోతున్నారు.  హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నిటినీ కోట్టేసిన హైకోర్టు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని  ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు జారీచేసింది. 

ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తన వైఖరి వెల్లడించింది. ఏపీ హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో వుంది ప్రభుత్వం. తీర్పు కాపిలు రాగానే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. ఏపీ హై కోర్టులో వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపింది ప్రభుత్వం ఈసీ విషయంలో హైకోర్టు తీర్పుని ముందుగానే అంచనా వేసామంటున్నాయి  ప్రభుత్వ వర్గాలు. అన్ని అంశాలపై పునరాలోచన చేసి సుప్రీంకోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle