newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

నిన్న అదానీ.. నేడు రిలయన్స్.. ఏపీ పెట్టుబడుల నిల్?

04-11-201904-11-2019 12:23:04 IST
Updated On 04-11-2019 16:34:42 ISTUpdated On 04-11-20192019-11-04T06:53:04.873Z04-11-2019 2019-11-04T06:52:58.171Z - 2019-11-04T11:04:42.256Z - 04-11-2019

నిన్న అదానీ.. నేడు రిలయన్స్.. ఏపీ పెట్టుబడుల నిల్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెలలు రోజుల్లా గడిచిపోతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పుష్కలంగా మానవ వనరులు.. ఆసియాలోనే అతిపెద్ద సముద్ర తీరం ఉన్నా వినియోగించుకొనే ఆలోచన కన్పించడం లేదు. కొత్త రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఉరుకులు పరుగులు పెట్టిన పనులు ఇప్పుడు నత్త నడకన సాగుతున్నాయి. ఫలితంగా నిపుణులు, యువత ఇతర రాష్ట్రాలకు వలసలు సాగుతున్నాయి. కానీ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఒక్కటంటే ఒక్కటీ ఆలోచన చేయనట్లుగా కనిపిస్తుంది.

ఇప్పటి ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను తీసుకొచ్చే ప్రణాళికలు చేయకపోగా గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను కూడా నిలుపుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే విశాఖలో అదానీ గ్రూప్ అరవైవేల కోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న డేటా సెంటరులో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటుపై అటు ప్రభుత్వం కానీ ఇటు అదానీ సంస్థ కానీ ప్రకటన చేయకపోగా అదానీ తెలంగాణలో తొంబై వేల కోట్లతో సెంటరును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

నిన్న అదానీ ఏపీ నుండి వెళ్ళిపోతే ఈరోజు మరో కంపెనీ రిలయన్స్ కూడా ఏపీకి మొహం చాటేసినట్లుగా తెలుస్తుంది. అదానీ జారుకుందన్న వార్త వచ్చిన వారంలోనే రిలయన్స్ కూడా వెనక్కు తగ్గినట్లుగా కథనాలు రావడం ఏపీ పరిస్థితికి.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. గత ప్రభుత్వం హయంలో రిలయన్స్ తిరుపతి విమానాశ్రయం సమీపంలో ఎలక్ట్రానిక్ సెజ్ ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకోసం రిలయన్స్ పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

గత ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సులో ఈ ఎలక్ట్రానిక్ సెజ్ ప్రతిపాదన రాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో రెండు గంటల భేటీ జరిపిన అనంతరం ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగిపోయాయి. ఈ సెజ్ ఏర్పాటుతో జియో ఫోన్స్, చిప్స్, రిలయన్స్ సెట్ టాప్ బాక్సులు తయారు చేయనున్నామని ముఖేష్ స్వయంగా చెప్పగా ఈ సెజ్ తో దాదాపు పాతికవేలమందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని అంచనా వేశారు.

ఈ ఎలక్ట్రానిక్ సెజ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయానికి కిమీల దూరంలోనే 150 ఎకరాల భూమి కేటాయించగా అప్పుడే అక్కడ భూమి పూజ కూడా జరిగి టెక్నీకల్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం కేటాయించిన భూమి కాకుండా ఇప్పుడు మరో చోట ఆ సంస్థ కోసం కేవలం 75 ఎకరాలను కేటాయించారు. అది కూడా కోర్టు కేసులలో ఉన్న భూమి కారణంగానే ఇప్పుడు రిలయన్స్ అక్కడ నుండి జారుకున్నట్లుగా తెలుస్తుంది.

ఒకపక్క ప్రస్తుత ఆ శాఖలకు బాధ్యత వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్రం ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సుకు కూడా మొహం చాటేస్తుండగా కంపెనీలు రాష్ట్రం నుండి వెళ్లిపోయేందుకు క్యూ కడుతున్నాయి. కొత్తగా పరిశ్రమలు రావడం సంగతెలా ఉన్నా గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్నవి కూడా తరలి వెళ్లడం.. ప్రభుత్వంలో లోపమా? ఆయా కంపెనీలకు భవిష్యత్ ఉండదనే నమ్మకమా? ప్రభుత్వం విధానాలే నచ్చడం లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle