newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

నిధుల కోసం తిప్పలు.. మట్టి తవ్వినా అక్కడ పన్ను కట్టాల్సిందే!

05-12-201905-12-2019 11:25:04 IST
Updated On 05-12-2019 11:30:35 ISTUpdated On 05-12-20192019-12-05T05:55:04.065Z05-12-2019 2019-12-05T05:55:01.526Z - 2019-12-05T06:00:35.153Z - 05-12-2019

నిధుల కోసం తిప్పలు.. మట్టి తవ్వినా అక్కడ పన్ను కట్టాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం మీద నిందలేసినా.. తమ నిర్ణయాల వలన ఆర్ధికంగా దెబ్బతిన్నా ఆర్ధిక సంక్షోభం ఉందన్న వాస్తవాన్ని మంత్రులే అంగీకరించారు. అయితే ఆ సంక్షోభం నుండి బయటపడేందుకు సర్కార్ ఎన్నో ప్రయత్నాలను చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.

ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకంగా మారాయని విశ్లేషకులు తేల్చిచెప్పినా సీఎం జగన్ మాత్రం అభివృద్ధి మీద దృష్టి సారించకపోగా కొత్త పథకాలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే ఒకపక్క ఆర్ధిక కష్టాలున్నా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కొత్త అప్పులు చేయడంతో పాటు ప్రభుత్వం భూములను కూడా తెగనమ్మేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

భూములతో పాటు రాష్ట్రంలో మట్టిని అమ్మెందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇసుక ఆన్ లైన్ విధానంతో పాటు స్టాక్ పాయింట్లతో ఖర్చు పెరిగిపోయింది. దీంతో నిర్మాణ రంగం కుదలైంది. కాగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా మట్టి తవ్వుకోవాలంటే ప్రభుత్వానికి నగదు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఇది ముందుగా పోలవరం ప్రాజెక్ట్ నుండే మొదలు పెట్టనున్నారట.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారీగా తవ్వకాలు జరపడంతో కాలవ గట్లపై భారీగా మట్టి చేరింది. ఆ మట్టిని విక్రయించడం ద్వారా ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో కాలవ గట్లపై 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఉండనుందని అంచనా వేయగా ఇది దాదాపు వెయ్యి కోట్లకు అమ్మాలని నిర్ణయించుకుంది.

అనుకున్నదే తడవుగా రాష్ట్రంలో ఇసుక పాలసీ తరహాలోనే మట్టి పాలసీని తేవాలని నిర్ణయించుకుంది. ముందుగా పోలవరం కాలువలపై ఉన్న మట్టి నిల్వలను గనుల శాఖ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక అక్కడ నుండి గోదావరి ,కృష్ణా, విశాఖ జిల్లాల పరిధిలో మట్టి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, మిగతా జిల్లాలలో గ్రావెల్ తో కూడిన మెటల్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు.

పోలవరం మట్టితో పాటు రాష్ట్రంలోని మట్టి నిల్వలను మట్టి పాలసీలోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగనుందని, ఈమేరకు పాలసీని రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ముందుగా పోలవరం కాల్వలపై మట్టిని ఓ చోట స్టాక్ పెట్టేందుకు ఐదు వేల ఎకరాలను గుర్తించాలని అధికారులను మంత్రి వర్గం ఆదేశించిందిట. క్లుప్తంగా మరో రెండు వారలలో నూతన మట్టి పాలసీ సిద్ధం కానున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇసుక దొరికే పరిస్థితి లేదని.. ఇప్పుడు నూతన మట్టి విధానం తేడా వస్తే ఇక రాష్ట్రంలో మట్టి కూడా దొరకదని నిర్మాణ రంగంలో కొందరు భయాందోళనలో ఉండగా గత ప్రభుత్వంలో పోలవరంతో పాటు రాష్ట్రంలో మట్టిని అక్రమంగా దోచుకెళ్లారని, దీని వలన ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, దీనిని అరికట్టేందుకే కొత్త పాలసీలు అని మంత్రులు చెప్తున్నారు. మరో ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.

 

 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle