newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

నిజమెంత : బీసీజీ సీఎం జ‌గ‌న్ సొంత సంస్థ‌నా..?

07-01-202007-01-2020 14:56:55 IST
Updated On 07-01-2020 16:22:08 ISTUpdated On 07-01-20202020-01-07T09:26:55.496Z07-01-2020 2020-01-07T09:26:46.890Z - 2020-01-07T10:52:08.918Z - 07-01-2020

నిజమెంత : బీసీజీ సీఎం జ‌గ‌న్ సొంత సంస్థ‌నా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌మ‌కు గిట్ట‌ని వారిపై వ్య‌తిరేకంగా ఏదోఒక త‌ప్పుడు అంశాన్ని సృష్టించ‌డం, దాన్ని సోష‌ల్ మీడియాలో బాగా ప్రచారం చేయడ‌మ‌న్న‌ది ఇటీవ‌ల బాగానే పెరిగింది. ఇలా ప్ర‌చారం చేయ‌డంలో ఒక రాజ‌కీయ పార్టీ అని కాకుండా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించిన వ్యక్తులు కూడా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డంలో ముందుంటుంది. కొంద‌రైనా ఈ ప్ర‌చారాన్ని న‌మ్మితే రాజ‌కీయంగా త‌మ‌కు ఉపయోగ‌మే క‌దా..! అని న‌మ్మే స్థాయికి ప‌రిస్థితులు దిగ‌జారిపోయాయి.

అయితే, కొంద‌రు.. కొన్ని పార్టీలు మాత్రం ఈ త‌ప్పుడు ప్ర‌చారం విష‌యంలో కూడా మోతాదును మించి హ‌ద్దులు దాటిపోయి సున్నిత‌మైన అంశాల విష‌యంలో కూడా ఒక విధ‌మైన త‌ప్పుడు ప్ర‌చారాన్ని చేస్తూ ఆనందించే ప‌రిస్థితికి వ‌చ్చేశారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వికేంద్రీక‌ర‌ణే మంచిదంటూ ఇటీవ‌ల బీసీజీ సంస్థ నివేదిక ఇచ్చిన నేప‌థ్యంలో ఆ సంస్థ‌పైన కొంద‌రు ఇప్పుడు కారాలు, మిరియాలు  నూరుతున్నారు.

బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక గిట్ట‌ని వాళ్లు, ఆ నివేదిక న‌చ్చ‌ని వాళ్లు ఆ సంస్థ‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కూడా  వ్య‌తిరేక ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు. 57 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ సంస్థ‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా బీసీజీ గ్రూప్‌కు చెందిన వికీపీడియా పేజ్‌పైన కూడా దండ‌యాత్ర చేసేశారు.

జ‌న‌వ‌రి 3, 4 తేదీల్లో దాదాపు 12 సార్లు బీసీజీ గ్రూప్‌కు చెందిన వికీపీడియా పేజ్‌లోకి వెళ్లిన కొంద‌రు వ్య‌క్తులు ఆ సంస్థ‌కు సంబంధించిన స‌మాచారాన్ని మొత్తం త‌ప్పుడు స‌మాచారంగా మార్చేశారు. బీసీజీ గ్రూప్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులుగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి పేర్ల‌ను కూడా చేర్చేశారు. 57 ఏళ్ల క్రితం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు ఈ సంస్థ‌ను నెల‌కొల్పారంటూ వికీపీడియా పేజ్‌లో చేర్చేశారు.

ఇటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ‌య‌స్సు 47 ఏళ్లు. కాబ‌ట్టి ఆయ‌న 57 ఏళ్ల క్రిత‌మే బీసీజీ సంస్థ‌ను నెల‌కొల్పేశారు. ఆయ‌నే వ్య‌వ‌స్థాప‌కులు అంటూ కూడా దాంట్లో చేర్చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఈ సంస్థ‌లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి 50 శాతం వాటా ఉంది అంటూ కూడా ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు. అయితే, ఇలా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంది అని గుర్తించిన ఆ సంస్థ ఆ పేజీలోని స‌మాచారాన్ని స‌రిచేసింది.

అయితే, అప్ప‌టికే కొంద‌రు వ్య‌క్తులు స్ర్కీన్ షాట్‌లు తీసుకుని సోష‌ల్ మీడియాలో వాటినే ప్ర‌చారం చేస్తూ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే ఈ సంస్థ‌కు వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య‌సాయిరెడ్డి, జ‌గ‌న్ క‌లిసి దీన్ని పెట్టారు. జ‌గ‌న్‌కు 50 శాతం వాటా ఉంది ఈ సంస్థ‌లో అంటూ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. ఇలా ఇప్పుడే కాదు కొద్ది రోజుల క్రితం వైవీ సుబ్బారెడ్డి విష‌యంలో కూడా ఇలానే చేశారు. ఆయ‌న‌కు సంబంధించిన వికీపీడియా పేజీలోకి వెళ్లిన కొంద‌రు వ్య‌క్తులు ఆయ‌న క్రిస్టియ‌న్ అంటూ ఏకంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. కానీ, ఆ త‌రువాత అదంతా అవాస్త‌వ‌మ‌ని ఆ త‌రువాత తేలిపోయింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle