newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

10-12-201910-12-2019 10:15:24 IST
Updated On 10-12-2019 13:20:58 ISTUpdated On 10-12-20192019-12-10T04:45:24.661Z10-12-2019 2019-12-10T04:45:17.305Z - 2019-12-10T07:50:58.774Z - 10-12-2019

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దారుణంగా హత్యాచారానికి గురై అసువులు బాసిన పశువైద్యురాలు దిశ  కుటుంబాన్ని పలకరించడానికి కూడా మనసురాని జాతీయ మానవహక్కుల సంఘం ఎన్‌కౌంటర్ పాలైన నిందితులకు మాత్రమే హక్కులు ఉన్నాయని భావిస్తోందా అంటూ ఏపీ శాసన సభ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లఘనపై మాత్రమే ఈ కమిటీ విలపిస్తున్నట్లుందని, హక్కులనేవి దిశ హంతకులకు మాత్రమే ఉన్నాయా అని నగరి ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజున రోజా మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల సంఘం తీరును ఆక్షేపించారు. అయిదేళ్లు నిండని పిల్లలను అత్యాచారం చేస్తున్నారు. వీరి హక్కులు మానవ హక్కుల కిందకే వస్తాయని హక్కుల కమిటీ గుర్తించడం లేదా అని రోజా ప్రశ్నించారు. దిశ ఘటనలో హక్కుల కమిటీ దిశ కుటుంబాన్ని కలవడానికి కూడా పూనుకోలేదని, కానీ ఎన్కౌంటర్‌లో హతమైన నిందితుల విషయంలో మాత్రం మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని అది బాధపడుతున్నట్లుందని రోజా ఎద్దేవా చేశారు. 

హక్కుల సంస్థ తీరు పట్ల రోజామాత్రమే అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎన్‌కౌంటర్‌ గురించి హక్కుల సంస్థ విచారణకు పూనుకోవడంపై దిశా కుటుంబం, వారి కాలనీలో నివసిస్తున్న వారు కూడా అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. 

తమ కుమార్తెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినప్పుడు మానవ హక్కుల కమిషన్‌ ఎక్కడకు పోయిందని ‘దిశ’ తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందాన్ని నిలదీశారు. అప్పడు మానవ హక్కులు కనిపించలేదా అని ప్రశ్నించారు. 

రెండో రోజు విచారణలో భాగంగా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఎదుట ఆదివారం ‘దిశ’ తల్లిదండ్రులు, సోదరి హాజరయ్యారు. ‘దిశ’ అదృశ్యమైన తర్వాత పోలీసుల స్పందనపై ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం వివరాలు సేకరించింది. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ‘దిశ’ తల్లిదండ్రులు, సోదరి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఇబ్బందులున్నా రాతపూర్వకంగా ఇవ్వాలని బృందం వారికి సూచించింది.

కాగా దిశ ద్వాధశ దిన కర్మ రోజున విచారణ పేరుతో జాతీయ మానవ హక్కుల సంఘం దిశ తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.  ‘‘దిశ’ తల్లి ఆరోగ్యం బాగోలేదని, విచారణకు ఆమె ఆరోగ్యం సహకరించదని, ఇబ్బంది పెట్టవద్దని’’ స్పష్టం చేసినా హక్కుల సంఘం ఆదేశాలను పాటించాల్సిందేనని పోలీసులు ఒత్తిడి పెట్టి మరీ వారిని తీసుకునిపోవడంపై దిశ కాలనీవాసులు ధ్వజమెత్తుతున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle