newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

నిందితులంతా ఫుల్ హ్యాపీ : ఈ ఒక్క‌ప‌ని చేసిపెట్టండి సారూ..!

08-11-201908-11-2019 19:58:03 IST
Updated On 08-11-2019 20:01:32 ISTUpdated On 08-11-20192019-11-08T14:28:03.518Z08-11-2019 2019-11-08T14:27:57.155Z - 2019-11-08T14:31:32.737Z - 08-11-2019

నిందితులంతా ఫుల్ హ్యాపీ : ఈ ఒక్క‌ప‌ని చేసిపెట్టండి సారూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దెందులూరు శాస‌న స‌భ్యుడిగా ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు ప‌నిచేసిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గ‌త 60 రోజుల నుంచి ఏలూరు స‌బ్ జైలులోనే ఉన్నారు. కాగా, ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. చింత‌మ‌నేనిపై న‌మోదైన కేసుల్లో ఎక్కువ‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులే అధికంగా ఉన్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

చింత‌మ‌నేని ఏలూరు జైలులో ఉన్నార‌న్న విష‌యం గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా రాజ‌కీయ విశ్లేష‌కుల  ప‌లు ప్ర‌శ్న‌ల‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న అక్క‌డ ఏం చేస్తున్నారు..?  జైలు సిబ్బంది, తోటి నిందితుల‌తో ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడ‌న్న చ‌ర్చ విశ్లేష‌కుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే, జైలులో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు ప్ర‌త్యేకంగా సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేదని, తోటి నిందితుల‌తో క‌లిసి మెలిసి ఉంటూ రోజూ పేప‌ర్లు చ‌దువుతున్నాడ‌ని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా చింత‌నేని ఇటీవ‌ల వాకింగ్ ఎక్కువ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా పెరిగిన‌ట్లు కార్య‌క‌ర్త‌లు చెప్పుకుంటున్నారు.

అంతేగాక చింత‌మ‌నేని జైలుకు రాక‌ముందే జైలులో నాశిర‌కం భోజ‌నం పెట్టేవార‌ని, దీనిపై ఆయ‌న అధికారుల‌ను ప్ర‌శ్నించ‌డంతో ఆహార నాణ్య‌త పెంచార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

చింత‌మ‌నేని ప్ర‌శ్నంచ‌డంతో ఆయ‌న‌తోపాటు మిగిలిన నిందితులంద‌రికీ రుచిక‌ర‌మైన భోజ‌నం అందుతోంది.

క్వాలిటీ ఫుడ్ అంద‌డంతో చింత‌మ‌నేనిని జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చూడాలని సహ నిందితులు కోరుకుంటున్న‌ట్టు స‌మాచారం. త‌మ నాయ‌కుడికి బెయిల్ ఎప్పుడొస్తుందా..? అని ఎదురు చూస్తున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఒక‌ట్రెండు రోజుల్లో జైల్లో ఉండి వ‌చ్చిన వాళ్లు చెబుతున్న ముచ్చ‌ట్లు న‌వ్వాలో.. ఏడ‌వాలో తెలీన‌ట్లు ప‌రిస్థితి త‌యారైంద‌ని చెప్పుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే, పోల‌వ‌రం కుడికాల్వ‌ను త‌వ్వ‌డంలో స‌హాయం చేశా.. ప‌సుపు కుంకుమ పంపిణీ స‌మ‌యంలో అంద‌రికీ సొంత ఖ‌ర్చుల‌తో నాన్‌వెజ్ భోజ‌నాలుపెట్టా.. గ్రామాల్లో రోడ్లు వేశా.. ప్ర‌తి రోజూ లేద‌న‌కుండా ఇంటి ద‌గ్గ‌ర భోజ‌నాలు పెట్టా.. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఓటుకు డ‌బ్బులు కూడా ఇచ్చా.. అయినా.. న‌న్నెందుకు ఓడించార‌ని జైలులో త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల ద‌గ్గ‌ర చింత‌మ‌నేనిని ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం.

ఇక ఇలాంటి ఆఫ్ ద రికార్డు మాట‌లు ఎలా ఉన్నా.. ఆయ‌న‌పై మ‌రో నాలుగు కేసులు పోలీసులు అద‌నంగా న‌మోదు చేశారు. శ్రీ‌రామ‌వ‌రంలో ద‌ళితుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా మాట్లాడారంటూ ఆయ‌నపై తాజాగా కేసు న‌మోదైంది. ఏదేమైనా ఇలా వ‌రుస కేసులు న‌మోదు చేస్తే వచ్చే ఎన్నిక‌ల నాటికి కూడా త‌మ నేత బ‌య‌ట‌కు వ‌స్తారో.. లేదో.. అన్న భ‌యం కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle