newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

నిందలు సరే.. కరెంట్ బాధ్యత మీదే కదా?

01-10-201901-10-2019 10:18:33 IST
2019-10-01T04:48:33.673Z01-10-2019 2019-10-01T04:48:31.982Z - - 06-12-2019

నిందలు సరే.. కరెంట్ బాధ్యత మీదే కదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గత రెండు వారాల నుండి అనధికారంగా కొన్ని జిల్లాలలో మొదలైన ఈ కోతలు.. నాలుగు రోజుల క్రితం నుండి అధికారికంగానే ఐదు జిల్లాలలో తీవ్ర కోతలు విధించారు. సోమవారం రాత్రి కూడా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలలో అధికారికంగానే కోత విధించారు. ఇక మిగతా జిల్లాలలో కోతలపై ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆయా ప్రాంతాన్ని బట్టి కట్స్ కొనసాగాయి.

ఏపీలో ఇప్పుడు విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని చెప్పుకోక తప్పదు. ఏపీఎస్పీడీసీఎల్ రెండు రోజుల క్రితమే ఓ సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. రాష్ట్రంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయి దాదాపుగా 1100 మెగావాట్ల మేర లోటు ఏర్పడిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి ఒకే సారిగా బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఇక ఇదే సమయంలో విండ్ - సోలార్ విద్యుదుత్పత్తిలోనూ సాయంత్రం వేళల్లో అనుకున్న మేర విద్యుదుత్పత్తి జరగడం లేదని.. ఇటు థర్మల్... అటు విండ్ - సోలార్ విద్యుదుత్పత్తతి ఒకేసారి పడిపోవడంతో తీవ్ర విద్యుత్ లోటు ఏర్పడిందని వివరించారు.

రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున విద్యుత్ ఉత్పత్తి 5 వేల మెగావాట్లపైనే ఉండగా ఈ ఏడాది అదే నెలలో 3 వేల మెగావాట్లకు కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఎలా లేదన్నా దాదాపుగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు కనబడుతోంది. మరోపక్క పీపీఏలు కూడా దెబ్బకొట్టాయి. కంపెనీలకు నిధులు ఇవ్వకపోవడంతో అవి కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. కేంద్రం ఏ విద్యుత్ కంపెనీ ఏపీకి కరెంట్ అమ్మకుండా నిషేధించింది. గతేడాది ఈ సమయానికి సగటు వినియోగంతో పోల్చితే ఈ ఏడాది అధికార వర్షాల వలన వినియోగం కూడా తగ్గింది. కానీ విద్యుత్ ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని స్పష్టంగా కనిపిస్తుంది.. అధికారుల మాటలో వినిపిస్తుంది. మరి ఉత్పత్తి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఎవరు? పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారు.

రాష్ట్రంలో కరెంటు పోతుంది సామీ అంటే అధికార వైసీపీ నేతలు వేలు గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ కంపెనీలకు బిల్లులు కట్టకుండా వెళ్లడంతో కంపెనీలు విద్యుత్ నిలిపివేశాయని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఆదే మాట. అయితే ఒప్పందాలు చేసుకున్న ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకైనా బిల్లులు పద్దతి ప్రకారం కట్టకపోతే సరఫరా కట్ చేసి పడేస్తాయి. దానికో వ్యవస్థ.. తతంగం ఉండనే ఉంది. కాకపోతే అది సామాన్యులకు తెలియదు. అందుకే వైసీపీ నేతలు అంతా మీరే చేసారని ఇంకా ఆ ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు.

నిందలు సరే.. కరెంట్ సక్రమ సరఫరా బాధ్యత మీదే కదా? గత ప్రభుత్వమే చేసినా ఈ ప్రభుత్వమే మోసినా సామాన్యుడికి అది అనవసరం. తన అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం కరెంట్ ఇచ్చిందా లేదా అన్నదే సామాన్యుడి అవసరం. గత సీఎం చంద్రబాబు ఐదేళ్లలో రెండో ఏడాదికే పవర్ కట్స్ లేకుండా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి అఖండ విజయాన్ని అందిస్తే నాలుగు నెలలలో మళ్ళీ మొదటికి తెచ్చారని ప్రజలలో టాక్ మొదలైంది. కరెంట్ లాంటి నిత్య వినియోగం జాబితా వాటితో ప్రభుత్వాలు జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంది. లేకపోతే రిజల్ట్స్ మారిపోతాయ్. ఇప్పుడు ఇప్పుడు నిందలు సరే.. సరఫరా బాధ్యతైతే మీదే కాదా! ఐ డోంట్ రీజన్స్.. ఐ వాంట్ రిజల్ట్.. ఇదే పీపుల్ ఇన్నర్ ఫీలింగ్స్!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle