newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

నారా లోకేష్ బినామీ వ్యాఖ్య‌ల‌పై వేమూరి క్లారిటీ..!

29-12-201929-12-2019 11:33:27 IST
Updated On 30-12-2019 12:42:07 ISTUpdated On 30-12-20192019-12-29T06:03:27.052Z29-12-2019 2019-12-29T06:02:07.048Z - 2019-12-30T07:12:07.084Z - 30-12-2019

నారా లోకేష్ బినామీ వ్యాఖ్య‌ల‌పై వేమూరి క్లారిటీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ హ‌యాంలో రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన అమ‌రావ‌తి ప్రాంతంలో 4 వేల ఎక‌రాల ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆరోప‌ణ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మాజీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌కు సన్నిహితులుగా ఉన్న‌టువంటి వ్య‌క్తులు వంద‌ల ఎక‌రాల‌ను కొనుగోలు చేశార‌న్న అభిప్రాయం వైసీపీ నుంచి ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

కాగా, నారా లోకేష్ బినామీగా వైసీపీ పేర్కొంటున్న వేమూరి ర‌వి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు, స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ల‌కు సంబంధించి వేమూరి ర‌వి క్లారిటీ ఇచ్చారు. ఏపీ ఎన్ఆర్టీ అధ్య‌క్షులుగా చేసిన మీరు రాష్ట్ర స‌ర్కార్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఏ విధంగా చూస్తారు..?  లోకేష్‌కు బినామీగా ఉన్నారా..? అస‌లు అమ‌రావ‌తిలో మీకు ఎంత భూమి ఉంది..? అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

నా ప్రొఫెష‌న్ డాక్ట‌ర్‌. అమెరికాలో 27 ఏళ్ల‌పాటు ప‌నిచేసి 2012లో రిటైర్ అయి నాడు రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌క ముందే ఏపీకి వ‌చ్చా. నాకు ఎవ‌రి బినామీగా చేయాల్సిన అవ‌స‌రం లేదు. అలా అని వేరే బినామీల‌ను పెట్టుకునే ధైర్య‌మూ లేదు. అటువంటిది న‌న్ను నారా లోకేష్ బినామీగా పేర్కొన‌డం అర్ధ‌ర‌హితం. నేను గ‌వ‌ర్న‌మెంట్‌కు ప‌నిచేస్తే మీకు బినామీగా ప‌నిచేసిన‌ట్టా..?, మ‌రి ఆ లెక్క‌న వంద‌లాది మంది క‌న్స‌ల్టెంట్‌లు ప్ర‌భుత్వానికి ప‌నిచేశారు క‌దా..?  వారంతా వైసీపీ బినామీలేనా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. విమ‌ర్శ‌లు చేసేముందు కాస్త ఆలోచించాలంటూ త‌న‌పై విమ‌ర్శ‌లు చేసేవారికి సూచించారు.

అమ‌రావ‌తిలోని భూముల గురించి..

మీకు రాజ‌ధాని ప్రాంతంలో భూములు ఉన్నాయా..? ఉంటే ఎన్ని ఎక‌రాలు ఉన్నాయి..? ఎప్పుడు కొనుగోలు చేశారు..? అన్న మీడియా ప్ర‌శ్న‌ల‌కు వేమూరి ర‌వి స్పందించారు. నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని, వైద్య వృత్తిని ఎంచుకున్న నాడే రిటైర్ అయ్యేనాటికి కృష్ణాన‌ది ప‌క్క‌న స్థిర‌ప‌డాల‌న్ని నా కోరిక‌. ఆ ప్ర‌కార‌మే 2005లో రాజ‌ధాని ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశా. ఆ త‌రువాత నేను ఊహించ‌ని విధంగా 2015 సెప్టెంబ‌ర్ 4న తుళ్లూరు ప్రాంతాన్ని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు.

రాజ‌ధాని ప్ర‌క‌టించిన 2015 సెప్టెంబ‌ర్ 4 త‌రువాత మ‌ళ్లీ అదే ప్రాంతంలో మ‌రికొంత భూమిని కొనుగోలు చేశా. అమ‌రావ‌తి ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశాను క‌నుక న‌న్ను నారా లోకేష్ బినామీ అంటున్నారు. క‌ర్నూలు, విశాఖ‌లోను నాకు భూములు ఉన్నాయి. మ‌రీ నేను మీకు బినామీనా అంటూ వైసీపీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు వేమూరి ర‌వి.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా త‌న‌పై చేసే విమ‌ర్శ‌ల్లో రోజుకో మాట మారుస్తుంద‌ని, మొద‌ట త‌న పేరుపై 500 ఎక‌రాల ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అని చెప్పి.. కొన్ని రోజుల‌కే 25 ఎక‌రాలు మాత్ర‌మేనంటూ నాలుక్క‌రుచుకుంద‌న్నారు వేమూరి ర‌వి. ఆ 25 ఎక‌రాల లెక్క కూడా అవాస్త‌వ‌మేన‌న్నారు. రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు విష‌యం ముందే తెలిసి.. 2015 సెప్టెంబ‌ర్ 4 లోప‌ల ఏవైనా భూములు కొనుగోలు చేసి ఉన్న‌ట్టు నిరూపించ‌గ‌లిగితే ఆ భూముల‌న్నింటిని ప్ర‌భుత్వానికే అప్ప‌గించేస్తానంటూ వేమూరి ర‌వి స‌వాల్ విసిరారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle