newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

నారా లోకేష్‌కు ప్ర‌మోష‌న్ గ్యారంటీనా..?

27-02-202027-02-2020 08:30:45 IST
2020-02-27T03:00:45.235Z27-02-2020 2020-02-27T03:00:40.774Z - - 05-04-2020

నారా లోకేష్‌కు ప్ర‌మోష‌న్ గ్యారంటీనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పార్టీలో మ‌రింత యాక్టీవ్ కానున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న‌కు మ‌రిన్ని కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ వ్య‌వ‌హారాలు ఇక‌పై లోకేష్ ఎక్కువ‌గా చూసుకోనున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు లోకేష్ విష‌యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఒక క్లారిటీకి వ‌చ్చార‌నే తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్‌ను త్వ‌ర‌లో వేరే ప‌ద‌విలో నియ‌మించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఆయ‌న‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ లేదా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో కీల‌క నేత‌లు ఈ ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు సైతం ఇందుకు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. విదేశాల్లో చ‌దువుకొని వ‌చ్చిన నారా లోకేష్ రాజ‌కీయ ప్ర‌సంగాల్లో త‌డ‌బ‌డినా రాజ‌కీయాల్లో మాత్రం ప‌ట్టు సంపాదించారు. పార్టీ అధికారంలో లేని స‌మ‌యంలో ఎక్కువ‌గా పార్టీ వ్య‌వ‌హారాలు, కార్య‌క‌ర్త‌ల సంక్షేమ బాధ్య‌త‌ల‌ను లోకేష్ స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించారు.

2014లో అధికారంలోకి రాగానే కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రిగా ఆయ‌న ప‌నితీరు బాగానే ఉండేది. అంతేకాదు, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నా చాలా విష‌యాల‌ను లోకేష్ చూసుకునేవారు. పార్టీ వ్య‌వ‌హారాలు, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాల్లో లోకేష్ పాత్ర ఎక్కువ‌గా ఉండేది. చంద్ర‌బాబును క‌ల‌వ‌క‌పోయినా లోకేష్ వ‌ద్ద‌కు వెళితే ప‌ని అయిపోతుంది అనేలా ఉండేది.

ఈ క్ర‌మంలో ఆయ‌నకు అన్ని జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి, నేత‌ల తీరుపై సంపూర్ణ అవ‌గాహ‌న ఉంది. సీనియ‌ర్ల ప‌ట్ల కూడా ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అయితే, లోకేష్ వ్యూహాలు, రాజ‌కీయ అవ‌గాహ‌న బాగానే ఉన్నా విదేశాల్లో చ‌దువుకొని వ‌చ్చిన ఆయ‌న ప్ర‌సంగాల్లో మాత్రం త‌ప్పులు దొర్లేవి. వీటిని బ‌ట్టి లోకేష్‌ను బ‌య‌టివారు త‌క్కువ అంచ‌నా వేసినా ఆయ‌న స‌మ‌ర్థుడ‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లో ఉంది.

ఇక‌, అధికారం కోల్పోయిన నాటి నుంచి లోకేష్ మ‌రింత యాక్టీవ్‌గా మారారు. సోష‌ల్ మీడియాను స‌మ‌న్వ‌యం చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ప్ర‌భుత్వంపై ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌నకు పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు ఉన్నార‌ని చెబుతున్నారు. 2019లో పార్టీ దారుణ ఓట‌మి త‌ర్వాత భ‌విష్య‌త్‌పై టీడీపీ నేత‌ల్లో అనుమానాలు ఉన్నాయి. చంద్ర‌బాబు వ‌యోభారం కూడా ఇందుకు కార‌ణం.

కాబ‌ట్టి, లోకేష్‌కు ఇప్పుడే పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెబితే నేత‌ల్లోనూ ధైర్యం వ‌స్తుంద‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. పైగా ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉన్నందున అప్ప‌టిలోగా ఆయ‌న పూర్తిగా ప‌ట్టు సాధించే అవ‌కాశాలు ఉన్నాయి.

తెలంగాణ‌లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ బాధ్య‌త‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే, టీడీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ‌కు కూడా క‌ళా వెంక‌ట్‌రావు స్థానంలో కొత్త వారిని నియ‌మించే ఆలోచ‌న‌లోనూ పార్టీ ఉంది. ఒక‌వేళ లోకేష్‌కు వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కాక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌వ‌చ్చ‌నే ప్ర‌చార‌మూ ఉంది.

 

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   12 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   13 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   15 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   16 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   19 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle