newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

నారాయ‌ణ క‌నిపించ‌రే..!

11-09-201911-09-2019 11:56:29 IST
Updated On 11-09-2019 12:00:22 ISTUpdated On 11-09-20192019-09-11T06:26:29.589Z11-09-2019 2019-09-11T06:26:27.379Z - 2019-09-11T06:30:22.925Z - 11-09-2019

నారాయ‌ణ క‌నిపించ‌రే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లో మాజీ మంత్రి నారాయ‌ణ ఒక పారాచ్యూట్ లీడ‌ర్ అనే చెప్పాలి. 2014 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ  రాజ‌కీయంగా ఎక్క‌డా వినిపించ‌ని ఆ పేరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కీల‌క‌మైంది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు వెంట‌నే ఆయ‌న‌ను క్యాబినెట్‌లోకి తీసుకొని కీల‌కమైన మున్సిప‌ల్ శాఖ క‌ట్ట‌బెట్టారు. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న విద్యా వ్యాపారిగానే అంద‌రికీ తెలుసు.

అయితే నారాయ‌ణ ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌చ్చినా తెర‌వెనుక మాత్రం ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నారాయ‌ణ పార్టీకి స‌హ‌క‌రించారు.

ఇందుకు కృత‌జ్ఞ‌త‌గానే ఆయ‌నకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మ‌రీ క్యాబినెట్‌లో బెర్త్ ఇచ్చారు చంద్ర‌బాబు. త‌ర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఇత‌ర మంత్రుల కంటే కూడా నారాయ‌ణ‌కు చాలా విష‌యాల్లో ఎక్కువ ప్రాధాన్య‌త ద‌క్కేది.

ముఖ్యంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఎంపిక వ్య‌వ‌హారం అంతా నారాయ‌ణ చేతుల మీదుగానే జ‌రిగింది. ఆయ‌న నేతృత్వంలోని క‌మిటీనే రాజ‌ధాని ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అమ‌రావ‌తి ప‌నులు జ‌రిపించ‌డంలోనూ ఆయ‌నే కీల‌కం.

ఎంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించినా దొడ్డి దారిలో మంత్రి అయ్యార‌నే ఒక విమ‌ర్శ మాత్రం నారాయ‌ణ‌పై ఉండేది. ఈ విమ‌ర్శ‌ను తిప్పికొట్టేందుకే 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు.

ఇందుకు సంబంధించి గ‌త మూడేళ్లుగా ఆయ‌న గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. మున్సిప‌ల్ మంత్రిగా త‌న‌కున్న అధికారాల‌తో నెల్లూరు సిటీని బాగా అభివృద్ధి చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను ప్ర‌యోగించారు.

చివ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన అనీల్ కుమార్ యాద‌వ్ చేతిలో ఓడిపోయారు. ఇప్ప‌డు అనీల్ మంత్రి కాగా నారాయ‌ణ మాత్రం సైలెంట్ అయిపోయారు. పార్టీ, నియోజ‌క‌వ‌ర్గ వ్య‌వ‌హారాల్లో ఎక్క‌డా ఆయ‌న పేరు వినిపించ‌డం, క‌నిపించ‌డం లేదు.

పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో నేత‌లంతా పాల్గొంటున్నా నారాయ‌ణ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ఆయ‌న టీడీపీని వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతార‌నే ప్ర‌చారం కూడా మొద‌లైంది. అయితే, నారాయ‌ణ సైలెంట్ కావ‌డానికి ఆయ‌న వ్యాపారాలు కూడా కార‌ణ‌మ‌ని అంటున్నారు.

వ్యాపారాల‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కుండా ఉండాల‌నే ఆయ‌న వైసీపీతో పెట్టుకోవ‌డం ఎంద‌క‌ని సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. మ‌రి, ఏరికోరి నారాయ‌ణ‌ను రాజ‌కీయాల్లోకి తెచ్చిన చంద్ర‌బాబు అయినా ఆయ‌న‌ను మ‌ళ్లీ యాక్టీవ్ చేస్తారో లేదో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle